
Dhanush Political Entry Draws New Debate
తమిళనాడు రాజకీయాలలోకి హీరో దళపతి విజయ్ ఎంట్రీ తో తమిళ సినీ ఇండస్ట్రీలో మరికొందరు స్టార్ హీరోలు తమ పొలిటికల్ ఎంట్రీ ఈక్వేషన్స్ మీద ద్రుష్టి సారిస్తున్నట్టు తమిళ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు హీరో ధనుష్.
రజనీకాంత్ మాజీ అల్లుడిగా, తమిళనాట సూపర్ స్టార్ డం ఉన్న హీరోగా ధనుష్ కి తమిళనాట ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న మాట వాస్తవం. అయితే దళపతి విజయ పొలిటికల్ ఎంట్రీ, దానితోనే రాష్ట్ర సీఎం గా పదవీస్వీకారం ఇలా విజయ్ జీవితంలో అనేక కీలక పరిణామాల్ని కూడా చకచకా జరిగిపోయాయి.
దీనితో సినీ ఇండస్ట్రీ గ్లామర్, ఇండస్ట్రీ నుంచి వచ్చిన అభిమానుల ప్రేమ ను ఓట్లుగా మలచుకోవడం పై తమిళ పార్టీలు ఆసక్తి కనపరుస్తున్నాయి. గత కొన్ని రోజుల కిందట హీరో ధనుష్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని, విజయ్ మాదిరి మరో కొత్త పార్టీని తమిళ రాజకీయాలకు పరిచయం చేయబోతున్నారని,
అందుకోసమే ఇప్పటి నుంచే ఫాన్స్ మీట్ అంటూ పలు కార్యక్రమాలు చేస్తూ గ్రౌండ్ ప్రెపేర్ చేస్తున్నారంటూ భిన్న వార్తలు వినిపించాయి. అలాగే హీరో, దర్శకుడు లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ, హీరో విశాల్ రాజకీయ అరంగేట్రం, నటి త్రిష రాజకీయ రంగ ప్రవేశం అంటూ ఇలా తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖుల పేర్లు తెరమీదకు వచ్చాయి.
దీనితో హీరో ధనుష్ పేరు తమిళ రాజకీయ పార్టీలలో ఆసక్తిని కనపరిచింది. అయితే ధనుష్ పొలిటికల్ ఎంట్రీ వార్తలతో AIADMK ఎలర్ట్ అయ్యింది. టీవీకే పార్టీతో తమిళ రాజకీయాలలో విజయ్ సృష్టించిన ప్రభంజనానికి అడ్డుకట్ట వేసేందుకు అదే ఇండస్ట్రీ నుంచి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో తమ పార్టీ కి అవసరం అనుకున్న AIADMK ధనుష్ ని తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ బహిరంగ ఆహ్వాన పత్రికను పంపింది.
ధనుష్ యువత పై గొప్ప ప్రభావాన్ని చూపగలరని, ఆయన అభిమాన బలం, సినీ గ్లామర్ రాష్ట్రానికి, తమ పార్టీకి దోహదపడితే బాగుంటుందంటూ ఏఐఏడీఎంకే పార్టీ నేత రాజేంద్ర కోరారు. అయితే అధికార టీవీకే కూడా ధనుష్ ని పొలిటికల్స్ లోకి ఆహ్వానించింది.
మరి ధనుష్ విజయ్ మాదిరి తన సొంత జెండా, అజెండాతో రాజకీయ ఎంట్రీ ఇస్తారా.? లేదా ఎవరి ఆహ్వాన పత్రిక పైనైనా ఆలోచన చేస్తారా.? లేదా సీనియర్ స్టార్ హీరోస్ రజని, కమల మాదిరి ఫాన్స్ కి నిరాశనే మిగులుస్తారా.?
Athulya Ravi steps into this gallery with a glow that feels rich, modern and effortlessly…
Andhra Pradesh has seen what happens when political rivalry becomes a personal battle. From the…