
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి, తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు (ఈయనే వెంకటేష్ నటించిన ‘గురు’ సినిమాకి సంగీతం అందించింది). నేడు దసరా సినిమాలోని తొలి పాట ‘ధూమ్ ధామ్ ‘ రిలీజ్ అయ్యింది. ఈ పాట వింటుంటే పరవాలేదనిపిస్తుంది. తెలంగాణ తీన్మార్ దరువులను సంతోష్ నారాయణ్ చాలా చక్కగా వాడుకున్నాడు. కానీ పాట లో అక్కడక్కడా తమిళ పాటల ఛాయలు కనపడతాయి. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పక్కా తెలంగాణా పదాలతో సాగింది.
సిల్క్ బార్ దగ్గర మందుబాబులందరూ కలిసి సరదాగా పాడుకునే పాట ఇది. వినగా వినగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోలో దృశ్యాలు చూస్తే, వామ్మో! మనం చూస్తుంది తెలుగు పాటా? తమిళ సినిమా పాటా? అనిపిస్తుంది. హీరో నానీ హావభావాలలోనూ తమిళ హీరోల ఛాయలు కనపడతాయి. ఇక దుమ్ము రేగిపోతూ హీరో చేసే డాన్స్ చూస్తే ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వం అదిరిందని చెప్పొచ్చు. సత్యన్ సూరియన్ కెమెరా చాలా బాగుంది.
ఈ సినిమాకి ప్రధాన టెక్నీషియన్స్ అందరూ తమిళ వారే కావడం వలన ఈ పాట నిండా తమిళ వాసనే ! తెలంగాణా బొగ్గు గనుల నేపధ్యం లో సాగే కథ ఈ ‘దసరా’. మన తెలుగు వాళ్లకు కూడా ఈ టైపు తమిళ సినిమాలు చూసి బాగా అలవాటు పడటం వలన, ఈ సినిమా లో కథ బాగుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పవచ్చు. నేపథ్యం లోని కొత్తదనం, మంచి టెక్నీషియన్స్ కలిసి ఈ సారైనా నానికి మంచి బ్లాక్బస్టర్ హిట్ ఇస్తారని ఆశిద్దాం. అంతవరకూ ఈ మాస్ బీట్ ని విని ఎంజాయ్ చేద్దాం.
Nani's recent release The Paradise carried a massive buzz ahead of its theatrical release. Unfortunately,…
కేంద్రంలో ప్రధాని మోదీని గద్దె దించడం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వల్లకాదని మూడుసార్లు నిరూపించబడింది. అలాగే ఏపీ…