
Dhruv Vikram stays calm amid row
గత కొన్ని రోజులుగా అనుపమ పరమేశ్వరన్ ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి అందరికీ తెలిసిందే. ఆమె పేరు తీయకపోయినా.. అందరూ ఆమె చెప్పిన టాక్సిక్ & నార్సిసిస్ట్ బాయ్ ఫ్రెండ్ ధృవ్ విక్రమ్ అని తీర్మానించేశారు. ఆమె కూడా ఇండైరెక్ట్ గా అన్నియన్/అపరిచితుడు రిఫరెన్స్ ఇవ్వడం అనేది సంచలనాత్మకంగా మారింది.
ఆ విషయంలో నిన్నటివరకు ధృవ్ రెస్పాండ్ అవ్వలేదు. కానీ.. ఓ మీడియా కాంక్లేవ్ కు అటెండ్ అయిన ధృవ్ ని హోస్ట్ ఇండైరెక్ట్ గా అనుపమ ఎలిగేషన్స్ గురించి ప్రశ్నించినప్పుడు చాలా పద్ధతిగా ప్రశ్నను దాటవేశాడు. ఇవన్నీ ముందే ఊహించానని, ఎంత హెట్రెడ్ వచ్చినా.. తాను మాత్రం స్థిమితంగానే ఉంటానని ధృవ్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనుపమ ఆడుతున్న బ్లేమ్ గేమ్ కి ధృవ్ దూరంగా ఉంటుండడం అనేది అతడివైపు ఉన్న సపోర్టర్స్ కి ఇంకాస్త ఎక్కువగా నచ్చుతోంది. ధృవ్ ఫ్యాన్స్ మాత్రమే కాక రెగ్యులర్ జనాలు కూడా ధృవ్ పద్ధతిని కొనియాడుతున్నారు. ఈ వయసులో చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్నాడని ప్రశంసిస్తున్నారు.
అయితే.. ఈమధ్యకాలంలో జరుగుతున్న ట్రెండ్స్ చూస్తుంటే, అమ్మాయిలే కాస్త ఎక్కువగా ఇలా బ్లెమ్ గేమ్ ఆడుతున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. పేర్లు తీయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ.. ఇటీవల జరిగిన చాలా సినిమా డివోర్సుల కేసుల్లో అమ్మాయిలే ఎక్కువగా హల్ చల్ చేయడం చూస్తున్నాం.
దీన్ని బట్టి చూస్తుంటే.. ఒక రిలేషన్ షిప్ లో ఎంత డిగ్నిఫైడ్ గా ఉన్నాం అనే దానికంటే.. ఆ రిలేషన్ షిప్ ని ఎంత డిగ్నిఫైడ్ గా ఎండ్ చేశాం అనేదాన్ని బట్టే ఒకరి క్యారెక్టర్ ను బాగా జడ్జ్ చేయొచ్చు అనిపిస్తోంది.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…