
మెగాభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న రామ్ చరణ్ “ధృవ” సినిమా డిసెంబర్ 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, సెన్సార్ బోర్డు నుండి ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను అందుకుందని సమాచారం. దీంతో యధావిధిగా ‘సెన్సార్ రిపోర్ట్స్’ పేరిట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమాపై ప్రచారం జరుగుతోంది.
ఈ కధనాల ప్రకారం… ‘ధృవ’ సినిమా ఫస్టాఫ్ ‘యావరేజ్’గా ఉంటుందని, సెకండాఫ్ ‘అదిరిపోతుందని’ ప్రచారం జరుగుతోంది. అలాగే సినిమా ప్లస్ పాయింట్స్ గా బ్యాక్ గ్రౌండ్ సంగీతం, చరణ్ లుక్స్ ఉండగా, మైనస్ పాయింట్స్ లో హీరోయిన్ రకుల్ పేరు వినపడుతుండడం విశేషం. ఒరిజినల్ ‘తనిఒరువన్’తో పోలిస్తే… తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చాలా మార్పులు చేసారని, ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం తెలియాలంటే… డిసెంబర్ 9 వరకు వేచిచూడాల్సిందే.
ఇటీవల కాలంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన మరుక్షణమే… ‘సెన్సార్ రిపోర్ట్స్’ పేరిట కధనాలు ప్రచురితం చేయడం పరిపాటిగా మారిపోయింది. ప్రతి పెద్ద సినిమాకు ఇలా ప్రచారం జరుగుతున్నా, ఒక్క సినిమాకు కూడా ముందు జరిగిన ప్రచారానికి, విడుదల తర్వాత వాస్తవానికి సంబంధం లేకుండా పోయింది. దీంతో విడుదల తర్వాత అవాక్కవ్వడం వీక్షకుల వంతవుతోంది. మరి ‘ధృవ’ విషయంలో ఏం జరుగుతోందో చూడాలి.
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…
Nora Fatehi turns a hotel-room backdrop into her own fashion runway, bringing fearless glamour to…