
తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియోలో రామ్ చరణ్ లుక్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ లో చెర్రీ అద్భుతంగా కనపడుతున్నాడు. నిజానికి ఇప్పటివరకు రామ్ చరణ్ నటించిన సినిమాలలో లుక్ పరంగా విమర్శకులను కూడా ప్రశంసించే విధంగా “ధృవ”లో కనపడుతున్నాడు. ప్రస్తుతం ఏర్పడుతున్న అంచనాలను ‘ధృవ’ అందుకోగలిగితే, బాక్సాఫీస్ వద్ద భారీ ‘మెగా’ ప్రభంజనం తప్పేలా కనపడడం లేదు.
పోలీస్ డ్రెస్ లో మెరిసిపోతున్న చెర్రీ లుక్ ని చూసి మురిసిపోవడం మెగా అభిమానుల వంతవుతోంది. అలాగే ఈ మేకింగ్ వీడియోలో చెర్రీ కనపరచిన ఓ యాక్షన్ సీన్ సూపర్ స్టైలిష్ గా ఉంది. మొత్తంగా చెప్పాలంటే… ఈ రీమేక్ ను ఫక్తు తెలుగు కమర్షియల్ ఎలిమెంట్స్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి సిద్ధం చేసినట్లుగా కనపడుతోంది. దీంతో వెండితెరపై ఎప్పుడెప్పుడూ చూద్దామా అని వేచిచూడడం అభిమానుల వంతవుతోంది.
బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయం మొదలుపెట్టిన సంగతి…
KVN Productions has quickly established itself as one of the ambitious production houses in South…