
సరిగ్గా ఇలాంటి పాటే మెగా వారసుడు రామ్ చరణ్ కెరీర్ లో కూడా నిలిచిపోబోతుందన్న సంకేతాలను తాజాగా విడుదల చేసిన వీడియో స్పష్టం చేసింది. “ధృవ” సినిమా టైటిల్ సాంగ్ మేకింగ్ వీడియోలో చెర్రీ పడ్డ కష్టమంతా కనిపించింది. బాడీ బిల్డ్ చేయడమంటే సాధారణ విషయం కాదు, అందరికీ చేతనయ్యే విషయం అంతకంటే కాదు. కానీ, రామ్ చరణ్ ఒక రేంజ్ లో కష్టపడ్డారని ఈ మేకింగ్ వీడియో స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఎన్ని పాటలు వచ్చినా… చెర్రీ శ్రమకు, డెడికేషన్ కు తార్కాణంగా ఈ “ధృవ” టైటిల్ సాంగ్ ఉండబోతుంది.
ఈ పాటను చూసిన తర్వాత “ధృవ” భారీ సక్సెస్ పై మెగా అభిమానుల మరింత రెట్టింపయ్యాయి. చూడబోతుంటే… అన్ సీజన్లో వచ్చి అదిరిపోయే రికార్డులను ఈ మెగా వారసుడు సొంతం చేసుకునేలా కనపడుతున్నాడని ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో ఇస్తున్న హైప్… మెగా ఫ్యాన్స్ ను కూడా ఉత్తేజపరుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ‘మగధీర’ వంటి భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న చెర్రీకి, మెగా అభిమానులకు ఆ ముచ్చట తీర్చేసేదిలా కనపడుతోంది.
Did the failure of Alia Bhatt’s Alpha end up affecting other female actors too? Taapsee…
The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…