
అయితే టాప్ దర్శకులతో పని చేసినప్పటికీ, రామ్ చరణ్ కు మాత్రం ఒక్క మిలియన్ డాలర్ సినిమా కూడా లేకపోవడం విశేషం. దీంతో డిసెంబర్ 9న రాబోతున్న “ధృవ”తో ఆ ముచ్చట తీర్చుకోవాలని భావిస్తున్న చెర్రీ, దీని కోసం భారీ కసరత్తులే చేసినట్లుగా కనపడుతోంది. ఈ సినిమా ఫస్ట్ షోను యుఎస్ లో ప్రదర్శించనున్నామని ప్రకటించిన ఈ సినిమా నిర్మాత అల్లు అరవింద్, ఈ షోకు “ధృవ” చిత్ర యూనిట్ మొత్తం హాజరవుతామని స్పష్టం చేసారు.
రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ లతో సహా హాజరు కావడం ద్వారా ప్రేక్షకులను సినిమాకు రప్పించగలిగితే… ప్రీమియర్ షోకు ఓపెనింగ్స్ కు కొదవ ఉండదని, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే… మిలియన్ డాలర్ ను అందుకోవడం తేలిక అవుతుందన్న స్కెచ్ ఈ ప్రణాళిక ద్వారా స్పష్టమైంది. అయితే గతంలో కూడా కొందరు సినిమాలు ఇలాగే ప్రకటించినప్పటికీ, చిత్రం విడుదల సమయం వచ్చేసరికి యుఎస్ ప్రేక్షకులపై ‘సీతకన్ను’ వేసారు. అయితే చెర్రీ ఉదంతం వేరే కావడంతో, ఖచ్చితంగా హాజరు కావచ్చనే సంకేతాలు అందుతున్నాయి.
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…
కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో…