
అవును… డిసెంబర్ 9వ తేదీన విడుదల కాబోతున్న “ధృవ” సినిమాపై ప్రేక్షకులు ఒక నిర్ణయానికి రావడానికి మరో 48 గంటల సమయం మిగిలి ఉంది. ప్రస్తుత కాలంలో ఒక సినిమా హిట్టు అవుతుందా? బోల్తా కొడుతుందా? అనే సంకేతాలను ధియేటిరికల్ ట్రైలర్ నిర్దేశిస్తోంది. ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై నమ్మకాలు పెట్టుకోవచ్చా? లేదా అన్నది కూడా ప్రేక్షకులు నిర్ణయించుకుంటున్నారు. ఇటీవల బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమా విషయంలోనూ ట్రైలర్ తర్వాత అంచనాలు రెట్టింపై, భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.
దీంతో మరో 48 గంటల తర్వాత (శుక్రవారం నాడు సాయంత్రం 7 గంటలకు) విడుదల కాబోతున్న “ధృవ” ధియేటిరికల్ ట్రైలర్ తో ఈ సినిమాపై సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేయొచ్చు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, వీడియో సాంగ్స్ అన్ని కూడా “ధృవ” సినిమాకు ప్లస్ పాయింట్స్ గానే ఉన్నాయి. ఈ నెల 25న విడుదల కాబోతున్న ట్రైలర్ కూడా ఇదే బాటలో పయనిస్తే… మెగా వారసుడు కూడా భారీ హిట్టు కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మెగా అభిమానులు కూడా ఈ ట్రైలర్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…