
“గట్టుప్పల్ నియోజకవర్గంలో మంచి పలుకుబడిన నేతగా మీకు మంచిపేరుందని మావాళ్లు చెపితేనే నేను మీకు ఫోన్ చేశాను. మీరు ఈ ఉపఎన్నికలలో మాకు సహకరిస్తే ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని విదాలా అభివృద్ధి చేసుకొందాము. మేము ఏదో డొల్ల మాటలు చెప్పి మీ సాయం కోరడం లేదు. మీ నియోజకవర్గంలో 79 వేల మందికి రైతుబంధు, 43 వేలమందికి పెన్షన్లు వస్తున్నాయి. మీ బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ పార్టీవాడు కాడు. ప్రధాని నరేంద్రమోడీ మీద ఆయనకు ఎటువంటి గౌరవం కూడా లేదు. ఆయన సంగతి మాకంటే మీకే బాగా తెలుసు. ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన చేసిందేమీ లేదు. మేము ఈ ఉపఎన్నికలలో ఓడిపోయినానంత మాత్రాన్న మా ప్రభుత్వం పడిపోదు… అతను గెలిచినంత మాత్రాన్న తెలంగాణలో మీ ప్రభుత్వం అధికారంలోకి రాదు. కనుక దయచేసి ఈ ఉపఎన్నికలలో మా పార్టీ అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు మీరు కాస్త మాకు సాయం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను,” అని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ వంటి రాజకీయ అనుభవజ్ఞుడు ఉపఎన్నికలకు ముందు తమ ప్రత్యర్ధి పార్టీ నేతకు ఫోన్ చేసి సహాయం కోరడం, అదీ… వారి పార్టీ అభ్యర్ధిని ఓడించడానికే తమకు సాయం చేయమని అభ్యర్ధించడం చాలా విడ్డూరంగా ఉంది. దీనిపై అప్పుడు బిజెపి నేతలు కేటీఆర్కు, టిఆర్ఎస్కు చురకలు వేయడం మొదలుపెట్టారు. మరి దీనిపై కేటీఆర్ ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.
Nani's recent release The Paradise carried a massive buzz ahead of its theatrical release. Unfortunately,…
కేంద్రంలో ప్రధాని మోదీని గద్దె దించడం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వల్లకాదని మూడుసార్లు నిరూపించబడింది. అలాగే ఏపీ…