
అఖిల్ ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న హిట్ “లెనిన్”తో దొరికింది. అయితే.. ఈ విజయంలో కీలకపాత్ర పోషించాల్సిన తమన్ తన బెస్ట్ ఫ్రెండ్ కోసం తన బెస్ట్ ఇవ్వలేదు అనేది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం.
“లెనిన్” సినిమాలో ఆరేడు పాటలుండగా.. రెండు మాత్రమే క్లిక్ అయ్యాయి. వాటిలో “జయ మంగళం, సోల్ ఆఫ్ లెనిన్” తప్ప మిగతా పాటలేవీ అంతగా అలరించలేకపోయాయి. మరీ ముఖ్యంగా.. సినిమాలో వచ్చే మొదటి రెండు పాటలు “రావణ సందనాల, ఎట్టా ఎట్టా” అయితే ప్రేక్షకులకి కూడా బోర్ కొట్టించాయి.
ఆ పాటల కొరియోగ్రఫీ కూడా అంతగా అలరించలేకపోయింది అనుకోండి. అయితే.. అఖిల్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొనే తమన్ నుండి ఇలాంటి బిలో పార్ పాటలు మాత్రం అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. “లెనిన్”తోపాటుగా విడుదలైన “హృదయం మురళి” చిత్రానికి మాత్రం సూపర్బ్ ఆల్బమ్ ఇచ్చాడు తమన్. “లెనిన్” బ్యాగ్రౌండ్ స్కోర్ తో కాస్త బ్యాలెన్స్ చేశాడు కాబట్టి సరిపోయింది కానీ.. లేకపోతే “లెనిన్”కి థమన్ మైనస్ అయ్యేవాడు.
అఖిల్ మొదటి చిత్రమైన “అఖిల్: పవర్ ఆఫ్ జువా” నుండి అఖిల్ జర్నీలో భాగస్వామిగా ఉన్నాడు తమన్. అనంతరం “మిస్టర్ మజ్ను”కి కూడా డీసెంట్ ఆల్బమ్ ఇచ్చాడు తమన్. మరి “లెనిన్” విషయంలో టైమ్ దొరకలేదా? లేక తమన్ తన బిజీ షెడ్యూల్లో ఇచ్చిన ట్యూన్సే ప్రసాదం అనుకున్నట్లు టీమ్ సరిపెట్టుకుందా అనేది తెలియాలి.
The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…
An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…