
Rajagopal Reddy's Discontent With Revanth Reddy
ఒకపక్క రాహుల్ గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ మోడీ సర్కార్ ని ఎలా గద్దె దింపాలా, ఎన్డీయే ప్రభుత్వం పై ఎలా రాజకీయ ఒత్తిడి పెంచాలా అని ఢిల్లీ వేదికగా తర్జన భర్జన పడుతుంటే మరోపక్క తెలంగాణ కాంగ్రెస్ మాత్రం పార్టీలోని సొంత నేతల నుంచి వెలువడుతున్న అసమ్మతి స్వరానికి ఎలా బ్రేకులు వేయాలి, మంత్రి పదవులే టార్గెట్ గా పార్టీలో జరుగుతున్న అంతర్గత రాజకీయానికి ఎలా చెక్ పెట్టాలని ఆలోచిస్తుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన నాటి నుంచి కూడా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మొదలు అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవ రూపంలోకి రావడానికి పెద్దగా సమయం పట్టలేదని చెప్పాలి. అయితే ఇందులో ర్యాంకింగ్స్ ఇస్తే మొదటి స్థానంలో నిలుస్తారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే గా రేవంత్ సర్కార్ లో మంత్రి పదవి ఆశించిన రాజగోపాల్ రెడ్డి ఆశలకు సీఎం రేవంత్ రెడ్డి బ్రేకులు వేశారనేది రాజగోపాల్ ఆరోపణ. అందుకు తగ్గట్టే తనకు అవకాశం చిక్కినప్పుడల్లా రేవంత్ పై పరోక్షంగా తన అసమ్మతి స్వరం వినిపిస్తూనే వచ్చారు.
అయితే తాజాగా కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు, అందుకు మంత్రిగా ఉన్న కొండా సురేఖ స్పందన కు గాను కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సురేఖ రాజీనామా తో ఖాళీ అయిన మంత్రి పదవి తన ఖాతాలోకి తెచ్చుకునేందుకు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి తో ఉన్న రాజకీయ విభేదాలను పక్కన పెట్టి మరి రేవంత్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేసారు.
తనకు సీఎం రేవంత్ కి కొన్ని విషయాలలో అభిప్రాయం బేధాలు ఉన్న మాట వాస్తవమే కానీ తనకు రేవంత్ కు మధ్య ఎటువంటి రాజకీయ ఆధిపత్య పోరు లేదంటూ రేవంత్ మనసు గెలిచే ప్రకటనలు చేసారు. అయినా కూడా కొండా సురేఖ రాజీనామా తో ఖాళీ అయిన మంత్రి పదవి రెడ్డి గారి ఖాతాలోకి రాలేదు.
దీనితో మరోసారి పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలకు తన అసంతృప్తిని బయటపెట్టేందుకు రాజగోపాల్ రెడ్డి మరోసారి తన అసమ్మతి స్వరాన్ని వినిపించారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మూడేళ్లయినా ఇప్పటి వరకు ఇవ్వలేదని, అయినా కూడా పరిస్థితులను అర్ధం చేసుకుంటూ సర్దుకుపోతున్నాని,
కనీసం తన సొంత నియోజకవర్గానికి కూడా నిధులు ఇవ్వడం లేదని, అధికార పార్టీలో ఉంటూ సొంత నియోజవర్గాన్ని కూడా అభివృద్ధి చెయ్యలేకపోతే ఎలా అని, మునుగోడు అభివృద్ధి కోసం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ ని కలిసి నిధులు అడిగినా ఇప్పటికి ఇవ్వలేదంటూ తన అనుచరుల సాక్షిగా సొంత ప్రభుత్వం పై అనేక విమర్శలు గుప్పించారు.
భట్టి తనను మోసం చేసారని, మోసం చేసిన వాయ్కటి దగ్గరకు పోకూడదు అనుకున్నా కూడా నియోజకవర్గ బభివృద్దికి నిధుల కోసం మనసు చంపుకుని భట్టి ని కలవడానికి వెళ్లాలంటూ రేవంత్ సర్కార్ టార్గెట్ గా రాజకీయం షురూ చేసారు.
వ్యవస్థలో లంచాలు ఎక్కవయ్యాయని, పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా నిధులు చెల్లించడం లేదని…ఇలా సొంత ప్రభుత్వంలోని లొసుగులను బయటపెడుతున్న ఈ రెడ్డి గారి అసంతృప్తి మంత్రి పదవితో తృప్తి చెందుతుందో లేదా ఏకంగా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుందో చూడాలి..!
Nagarjuna is presenting debutant Aniesh's Itllu Arjuna. The movie features him as a mute character…
The Rajya Sabha is expected to be a House of experience, knowledge and public service.…