జగన్‌-చంద్రబాబు వంద రోజుల పాలన బేరీజు వేస్తే…

టిడిపి కూటమి ప్రభుత్వం అధికరంలోకి వచ్చి నేటితో వంద రోజులు పూర్తయ్యింది. ఈ వంద రోజులలో రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడే అనేక మంచిపనులు చేశామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పుకుంటుంటే, వందరోజులలోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారని జగన్‌ వైసీపి నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే టిడిపి కూటమి ప్రభుత్వం వందరోజుల పాలన కంటే తమ వైసీపి ప్రభుత్వ వందరోజుల పాలన చాలా మెరుగైనదని వైసీపిలో ఎవరూ గట్టిగా చెప్పలేకపోతున్నారు… ఎందువల్ల?

ADVERTISEMENT

వైసీపి నిజాలు దాచిపెట్టిన్నప్పటికీ మీడియాలో ఫోటోలతో సహా దాని చరిత్ర భద్రంగానే ఉంటుందనే విషయం మరిచిపోయి వైసీపి నేతలు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు.

నిజానికి జగన్‌ ప్రభుత్వంతో టిడిపి కూటమి ప్రభుత్వం వందరోజుల పాలనని పోల్చి చూడటం కాదు… రాష్ట్ర విభజన తర్వాత టిడిపి కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనతో జగన్‌ ప్రభుత్వం పాలన పోల్చి చూస్తే అది ఇంకా హీనంగా కనిపిస్తుంది.

ఆ సమయంలో ముఖ్యమంత్రికి కనీసం అధికార నివాసం లేదు. సచివాలయం, అసెంబ్లీ, డీజీపీ కార్యాలయం, హైకోర్టు వంటివి ఏవీ లేవు. వాటిని నిర్వహించుకునేందుకు కార్యాలయాలు లేవు. ప్రభుత్వోద్యోగులందరూ హైదరాబాద్‌లో ఉన్నారు. కనుక హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా అక్కడి నుంచే రాష్ట్రాన్ని పాలించుకోవలసిన దయనీయ పరిస్థితి నెలకొని ఉండేది.

ఆ సమయంలో విభజన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వలేదు. పైగా విద్యుత్ సంక్షోభం. ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోక మునుపే హూద్ హూద్ తుఫాను భీభత్సం… ఒకటేమిటి అనేక సమస్యలను సిఎం చంద్రబాబు నాయుడు చాలా గుండె నిబ్బరంతో ఎదుర్కొని రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. అమరావతి, పోలవరం పనులను పరుగులు పెట్టించారు కూడా.

వడ్డించిన విస్తరిలా సిఎం చంద్రబాబు నాయుడు ఏపీని జగన్‌ చేతికి ఇస్తేనే పాలించడం చాతకాక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు. అదే ఇన్ని సమస్యలతో ఉన్న రాష్ట్రాన్ని చేతికి ఇస్తే జగన్‌ ఏం చేసేవారు? అని ఆలోచిస్తే వందరోజులు పాలన చేయలేక చేతులెత్తేసేవారని చెప్పవచ్చు.

ఇక టిడిపి కూటమి ప్రభుత్వం-2024 వందరోజుల పాలనని ఎద్దేవా చేస్తున్న వైసీపి మూకలు తమ హయాంలో మొదటి వంద ఏమేమి చేశారో తెలుసా? దాంతో పోలిస్తే టిడిపి కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో ఓసారి చూద్దాం.

Share

Recent Posts

M.S. Raju’s ‘Agadha’ Gets OTT Release Date

Director M.S. Raju, known for bringing a distinctive sensibility to his films, is back with…

5 minutes ago

BB Telugu: Stage Set For Group Fights

The second week of Bigg Boss concluded with Krishnudu's eviction. And Nagarjuna announced that the…

18 minutes ago