
కానీ… శేఖర్ కమ్ముల “ఫిదా” మాత్రం ఇందుకు మినహాయింపు. ఇది స్వయంగా దిల్ రాజు చేసిన ప్రకటనే. సహజంగా తన సినిమాలలో అన్ని విషయాలు తానే దగ్గరుండి చూసుకుంటానని, కానీ “ఫిదా” మాత్రం ‘శేఖర్ కమ్ముల బ్రాండ్’ అని కితాబిచ్చారు. ఈ సినిమాలో తాను వేలుపెడితే మొత్తం “కిచిడి” అయిపోతుందని తనకు తెలుసని, అందుకే ఈ సినిమాకు తాను దూరంగా ఉన్నానని, ఇదే విషయం ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్పానని, ఈ సక్సెస్ మొత్తం శేఖర్ కమ్ములకే చెందుతుందని అన్నారు.
‘బొమ్మరిల్లు’ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో మా బ్యానర్ కు పేరు తెచ్చిపెట్టిన శేఖర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు రాజు గారు. ‘బొమ్మరిల్లు’ సినిమాకు మొదట కడప నుండి టాక్ వచ్చిందని, ‘ఫిదా’కు నెల్లూరు నుండి ఫస్ట్ టాక్ వచ్చిందని, ఈ క్లాస్ సినిమాకు మాస్ ఆడియన్స్ బ్రహ్మరధం పట్టడంతో సినిమా రేంజ్ మారిపోయిందని, ఇదే విషయం ఫస్ట్ డే సంధ్య ధియేటర్లో చూస్తున్నపుడు కలిగిందని, ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు టాలీవుడ్ సక్సెస్ ‘ఫుల్’ ప్రొడ్యూసర్.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…