
‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ నిర్మించబోయే సినిమా “DJ దువ్వాడ జగన్నాధం” పూజాకార్యక్రమాలు సోమవారం నాడు జరగనున్నాయి. దీనికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ ఎకౌంటు నుండి దిల్ రాజు ఒక ట్వీట్ చేసారు. దీంతో స్టైలిష్ స్టార్ సినిమాపై ఒక స్పష్టత వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ‘గబ్బర్ సింగ్’ అందించిన హరీష్ శంకర్, మరో మెగా హీరో సుప్రీం స్టార్ సాయిధరమ్ తేజ్ కు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ను అందించి, మెగా హిట్లను కొనసాగించాడు.
దీంతో ఈ మెగా హీరోకు ఎలాంటి సక్సెస్ ను అందిస్తాడో అంటూ అభిమానులలో చర్చలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే దిల్ రాజు – హరీష్ శంకర్ ల కాంభినేషన్లో ఇప్పటికే ‘రామయ్యా… వస్తావయ్యా…’ విడుదలై భారీ డిజాస్టర్ ను చవిచూసిన సంగతి తెలిసిందే. బహుశా ఆ నష్టాలను భర్తీ చేసేటంత భారీ హిట్ ను దిల్ రాజుకు కానుకగా ఈ ‘షాక్’ దర్శకుడు అందిస్తాడేమో చూడాలి.
Dulquer Salmaan’s I’m Game has not found the expected traction in the Telugu states. The…
Rashmika Mandanna, who recently took a break from work after suffering a hip injury, has…