
అందులో భాగంగా చిత్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లతో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… సదరు మీడియా ప్రతినిధి ‘మీ మొదటి కారు ఏది?’ అని బోయపాటిని ప్రశ్నించగా, అందుకు ‘ఫోర్డ్ ఐకాన్’ అంటూ బదులిచ్చారు బోయపాటి. తన మొదటిసినిమా ‘భద్ర’ సినిమా హిట్టయిన తర్వాత నిర్మాత దిల్ రాజు గారు అందించిందిన బహుమతి ఈ కారు అని చెప్పిన బోయపాటి, తన తదుపరి కార్ల గురించి చెప్పారు.
దిల్ రాజు గారు ఇచ్చిన కారు ఎక్కువగా షెడ్ లోనే ఉండేదని చెప్పిన బోయపాటి, మళ్ళీ ఈ వ్యాఖ్య ఎలాంటి వివాదానికి దారి తీస్తుందోనని దానికి వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఆ కారుకు మంచి ఇంజిన్ రాలేదని అందుకే షెడ్ లో ఉండేదని, ఆ తర్వాత ‘తులసి’ సమయంలో ‘స్క్వోడా’ను కొనుగోలు చేసానని, ప్రస్తుతం ‘ల్యాండ్ రోవర్’ కారు వాడుతున్నానని కాస్త గర్వంగానే చెప్పుకున్నారు బోయపాటి.
For Congress, the November 1 rally at Delhi's Ramlila Maidan was an opportunity to show…
The Tiger Shroff firing incident appears to have changed more than just the security arrangements…