
రెండు ఫిల్మ్ ఛాంబర్లు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సంక్రాంతికి ఐదు సినిమాలు వస్తున్నాయి కాబట్టి పరిశ్రమ బాగు కోసం తీవ్రంగా కృషి చేశాం అంటూ తమకు తాము భుజాలు తట్టుకుని తతంగం ముగించేశారు.
ఈగల్ వాయిదా పడింది. ముందుగా మాట ఇచ్చినట్టు వాళ్లకు సోలో డేట్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం అని ప్రకటించారు. ఈగల్ నిర్ణయానికి నిర్మాత విశ్వప్రసాద్ ని, హీరో రవితేజ ని మెచ్చుకోవాలి.
దానికి క్రెడిట్ పెద్దలు తీసుకున్నారు. సరే వాళ్ళు ఏదో ఎఫర్ట్ పెట్టే ఉంటారు అనుకుందాం.
దాని వల్ల వెంకటేష్ సినిమా కి మంచి జరిగింది. మిగిలిన సినిమాలు కూడా ఎంతో కొంత లాభపడతాయి.
సో… ఈగల్ నిర్ణయం మంచిదే. అయితే సమస్య పూర్తి అయిపోయిందా?
వెంకటేష్ సినిమాకు హెల్ప్ అయ్యింది ఛాంబర్. అలాగే నాగార్జున సినిమాకు కూడా. మరి చిన్న సినిమా ‘హనుమాన్’ మాట ఏమిటి?
ఈ మాటే M9 News ప్రతినిధి పెద్దల ముందు ప్రస్తావిస్తే… దిల్ రాజు గారికి కోపమొచ్చింది.
హెల్తీ ఎన్విరాన్మెంట్ ని మీడియా చెడగొడుతుందని… సుద్దులు చెప్పారు.
ఆ మాట అటుంచితే… జనాలు మార్నింగ్ షో కి ఎగబడే సినిమాలే పెద్ద సినిమాలని… ఆ ప్రకారం ప్రయారిటీ ఆర్డర్… గుంటూరుకారం, సైంధవ్, నా సామి రంగ, చివరిగా హనుమాన్ అని చెప్పేశారు ఆయన.
ఈ ప్రకటన చెయ్యగానే పక్కనే ఉన్న హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి మొహంలో నెత్తుటి చుక్క లేదు.
గుంటూరుకారం కచ్చితం గా మొదటే ఉంటుందని… ఆ తరువాత ఆర్డర్ లో హనుమాన్ చివరన ఉండటం దారుణం.
మిగతా మూడు సినిమాలు నైజాం లో దిల్ రాజువే కాబట్టి హనుమాన్ కి అన్యాయం చేస్తున్నారని కొందరి వాదన.
హనుమాన్ కి ఎలా న్యాయం చెయ్యాలి అంటే చెప్పడం కష్టమే… ఎందుకంటే గుంటూరుకారం… స్టార్ సినిమా, భారీ బిజినెస్, భారీగా రిస్క్… కాబట్టి దానికి ఉండే స్పేస్ దానికి ఉండాల్సిందే. అయితే హనుమాన్ కి ఏదో రకంగా అవకాశం ఇవ్వాలి కదా?
సొంత వ్యాపారం, స్టార్ హీరోల తో రిలేషన్స్ అన్నీ ముఖ్యమే… అయితే ఛాంబర్, కౌన్సిల్ పదవుల్లో ఉన్నప్పుడు చిన్న సినిమాలకు న్యాయం చెయ్యడం కూడా ముఖ్యమే.
ఒకవేళ హనుమాన్ నిర్మాత వేరే డేట్ కి ఎందుకు వెళ్లలేం అని చెప్పే లాజిక్ తప్పు అయితే కనీసం ఆ మాట అయినా బయటకు చెప్పాలి.
సరే థియేటర్ల గొడవ పక్కన పెడతాం… ఒక చిన్న సినిమాగా మొదలు పెట్టి ఈ రోజు ఇంత బజ్ తెచ్చుకున్న హనుమాన్ ని లాస్ట్ లో పడేసి ఆ టీమ్ ఆత్మస్థర్యాన్ని దెబ్బ కొట్టారు దిల్ రాజు. బహుశా ఆయన చెప్పిన ‘చిన్న సినిమాలకు చిన్న న్యాయం’ లాజిక్ ఇదన్న మాట!
Mithun Chakraborty is playing villain role in Rajinikanth's Jailer 2. But before signing the film,…
Success may have changed Vijay Deverakonda’s life, but it hasn’t changed the way he thinks.…