
“పెద్ది” తర్వాత లేదా “పెద్ది” నుండి ఆడియన్స్ థియేటర్స్ కి రావడం మొదలెట్టారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటిదాకా ఖాళీగా ఉన్న చాలా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడాయి. “మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ, బ్లాస్ట్ జోన్, లెనిన్, డిసి, కొరియన్ కనకరాజు, విశ్వనాథ్ & సన్స్” వంటి సినిమాలన్నీ డీసెంట్ కలెక్షన్స్ సాధించాయి.
అందుకు కీలక కారణం టికెట్ హైక్ లేకపోవడమే. నాగవంశీ, సమంత, నాగార్జున, యువీ క్రియేషన్స్ వంశీ వంటి నిర్మాతలందరూ తమ సినిమాలకి ఎలాంటి టికెట్ హైక్ అప్లై చేయలేదు. అందువల్ల ఆ సినిమాలు సాధారణ ధరకి కాకపోయినా.. ఉన్నదాంట్లోనే బెటర్ రేట్స్ వల్ల సినిమాలకి స్టాండర్డ్ కలెక్షన్స్ వచ్చాయి.
టికెట్ హైక్ కారణంగా గతంలో “ఓజీ, పెద్ది” లాంటి సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్లకి తీసుకురాలేక ఎంత ఇబ్బందిపడ్డాయో చూసిన తర్వాత కూడా దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత, బడా డిస్ట్రిబ్యూటర్ తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తాజా కన్నడ చిత్రం “టాక్సిక్” విషయంలో టికెట్ హైక్ తీసుకోబోతున్నాడని తెలుస్తోంది.
ఉదయం స్పెషల్ షోస్ కి 500 నుండి 600 రూపాయల హైక్, మిగతా షోస్ కి మొదటి అయిదు రోజులు 200 దాకా హైక్ అప్లై చేయనున్నాడని సమాచారం. ఇదే గనుక నిజమైతే దిల్ రాజు పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది. ఎంత కేజీఎఫ్ తర్వాత వస్తున్న యష్ సినిమా అయినా.. కేజీఎఫ్2 కి ఉన్నంత యాంటిసిపేషన్ టాక్సిక్ కి లేదు. ఈ విషయం దిల్ రాజుకి కూడా తెలుసు.
అయినప్పటికీ.. ఫుట్ ఫాల్స్ ని పట్టించుకోకుండా కేవలం మొదటి మూడు రోజుల కలెక్షన్స్ మీద ఆధారపడి ఇలా టికెట్ హైక్ లకి వెళ్తే మాత్రం పరిస్థితి అధ్వాన్నంగా మారడం ఖాయం. గతంలో “వార్ 2, కూలీ” లాంటి డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్ తీసుకున్నప్పుడు సోషల్ మీడియా జనాలు గట్టిగా రెస్పాండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
ఇవన్నీ చూసి కూడా దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది సినిమాగా టాక్సిక్ మీద లేనిపోని అనుమానాలను తావిస్తోంది. మరి దిల్ రాజు చేస్తున్న ఈ రిస్క్ ఎంతవరకు ఆయన్ని సేఫ్ జోన్ లో పడేస్తుంది అనేది చూడాలి.
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…
One of the iconic film franchises in Indian cinema turned out to be Dhurandhar. First…