
తమపై ఎవరెవరో పెత్తనం చలాయించాలని చూస్తున్నారని, ప్రధానంగా తమిళులు కాని వారు తమపై పెత్తనం చలాయించాలని చూస్తున్నారని పరోక్షంగా రజనీకాంత్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. తమిళులకు మంచి నేతలు లేరని వారు చెప్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారొచ్చి తమని ఏలాలని చూస్తున్నారని మండిపడ్డారు. సరే వారు చెప్తున్నట్లే… తమిళులకు మంచి నేతలే లేరనుకుందాం. అలాంటప్పుడు వీరొచ్చి మాత్రం ఏం చేస్తారు? అని ప్రసంగం ఆద్యంతం రజనీని టార్గెట్ గా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేసారు.
అంతే కాకుండా… వారు అలా అనడం ఎలా ఉందంటే… భార్య గర్భవతి కాలేదని బాధపడుతున్న వాడితో నీ బిడ్డకు తండ్రిగా ఉంటానని అడుగుతున్నట్టు ఉందని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. దానికి కొనసాగింపుగా, ఏ విషయంలో అయినా భాగం అడగొచ్చు, కానీ పడకలోనూ భాగం కావాలని డిమాండ్ చేస్తే ఎలా ఇస్తామంటూ కాస్త శృతిమించారు. భారతీరాజా అలా పచ్చిగా మాట్లాడే సరికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. విమర్శలు ఎవరైనా చేయవచ్చు కానీ మరీ ఇంత నీచమైన వ్యాఖ్యలు చేయడం ఏంటని సూపర్ స్టార్ అభిమానులు, కోలీవుడ్ వర్గాలు కామెంట్స్ చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చాయి. కూటమి ప్రభంజనం ముందు వైసీపీ నిలవలేకపోయింది. జిల్లా…
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో కూటమి ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో వైసీపీ కి ఊరట…