Telugu

వైసీపీ ‘లోకల్ స్టార్’ బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి.?

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో కూటమి ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో వైసీపీ కి ఊరట కలిగించే విజయం కూడా ఒకటి నమోదయ్యింది.

అయితే ఆ విజయం వైఎస్ కంచుకోట పులివెందుల అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వైసీపీ ఫేస్ ఆఫ్ గా ఉన్న జగన్ ఇలాకాలో కూడా సాధ్యం కానీ విజయాన్ని బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి సాధించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు లో జరిగిన స్థానిక ఎన్నికలలో వైసీపీ 32 వార్డులకు గాను 23 వార్డులు కైవసం చేసుకుని తన స్పష్టమైన మెజారిటీని నమోదుచేసింది.

ADVERTISEMENT

వైఎస్ఆర్ చైర్ పర్సన్ గా ఫాతిమా బీ 4వేల ఓట్ల మెజారిటీ తో విజయం సాధించింది. ఇక టీడీపీ 9 వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ కి ఇంతటి ప్రతికూల వాతావరణంలోని ఈ స్థాయి విజయం అంటే అది వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాధించడం అంటే అది ఖచ్చితంగా బైరెడ్డి విజయమనే చెప్పాలి.

లోకల్ బాడీ ఎన్నికల నామినేషన్ల నుంచి ఎన్నికల ఓటింగ్ వరకు బైరెడ్డి పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకుని ఇంటింటి ప్రచారం చేపట్టారు. దాని తాలూకా ఫలితమే నేడు వైసీపీ ఈ విజయం అని చెప్పాలి. దీనితో నందికొట్కూరులో బైరెడ్డి తన రాజకీయ పట్టు నిలుపుకోవడంతో పాటుగా వైసీపీ పార్టీ స్థానిక ఎన్నికలకు ‘లోకల్ స్టార్’ గా గుర్తింపు పొందారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వంగవీటి రాధ బర్త్ డే గిఫ్ట్ లోడింగ్..?

ఏపీ వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల సమరంలో రాజకీయాలకు అత్యంత కేంద్ర బిందువుగా ఉండే విజయవాడ మేయర్ పీఠంపై తీవ్ర…

2 minutes ago

The Route Connection: Why Nayanthara Getting Big Films?

Following the back to back failures of Toxic and Hi, actress Nayanthara is all set…

11 minutes ago