
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్వేచ్ఛవల్లే అద్భుతం సృష్టించగలిగామని పేర్కొన్నారు. నదీహారతి కోసం కళాదర్శకుడు సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా అద్భుతంగా పనిచేశారని అన్నారు. పుష్కరాలు తనలో నింపిన అనుభూతిని, ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని బోయపాటి అన్నారు. హారతి, మ్యూజిక్, స్పెషల్ ఎఫెక్ట్ అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించామని పేర్కొన్నారు. భక్తుల సంతోషాన్ని తాను కల్లారా చూసినట్లు తెలిపారు.
చంద్రబాబు అశించిన దానికి తగ్గట్లే ఏర్పాట్లు సమర్థవంతంగా చేశామని బోయపాటి చెప్పారు. కృష్ణా పుష్కరాల్లో ఎంతో శ్రద్ధ వహించి పనులు చేశామని అన్నారు. ప్రజల్లో భక్తి భావం మరింత తీసుకురావడాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. తమతో పాటు పనిచేసిన సిబ్బంది ఎంతో ఓర్పుతో పనులు చేశారని అన్నారు.
Director Sandeep Reddy Vanga had been tasting phenomenal success right from the early stages of…
Small films are releasing in large numbers in Tollywood, but very few are making a…