
దాసరి గురించి చెప్పాలన్నా… మాట్లాడాలన్నా కూడా ఒక అర్హత కావాలి… అంతటి గొప్ప వ్యక్తి మన ‘దర్శకరత్న.’ తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టతలను జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసిన వ్యక్తులలో దాసరి పేరు ఎప్పుడూ పైనే ఉంటుంది. ఈ 75 ఏళ్ళ ప్రస్థానంలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి దాసరి. ఇండస్ట్రీలో హీరోలకే అభిమానులు ఉన్న పరిస్థితులలో… ఒక దర్శకుడికి కూడా క్రేజ్ ఉంటుందని… ఆ దర్శకుడు పేరు చెప్తే కూడా జనాలు సినిమాలకు క్యూలు కడతారని చాటిచెప్పిన దర్శకదిగ్గజం… ఒక రకంగా చెప్పాలంటే… తెలుగు దర్శకులకే ‘బ్రాండ్ అంబాసిడర్’ మన దాసరి.
అంతటి మహనీయుడు ‘ఇక లేరు’ అన్న వార్త విని… పగిలిపోయిన గుండెలు ఎన్నో ఎన్నెన్నో..! కంటికి కనిపించని ఆ గుండెల రోధన వర్ణించడం వర్ణణాతీతం. ఎందుకంటే… తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ కావాల్సిన వ్యక్తి ఎవరు అంటే… మొదట వినిపించే పేరు దాసరి. ఎవరికీ ఏ ఆపద వచ్చినా ముందుగా తొక్కే గుమ్మం ఎవరిదీ అంటే… అప్పుడూ ఎదురయ్యేది దాసరి అన్న ఒక్క పేరే. అలాంటి వ్యక్తి లేరు, ఇక రారు, ఆ గుండె మే 30వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఆగిపోయింది అంటే… మనసు పడే ఆవేదనను వర్ణించాలంటే సాధ్యమయ్యేనా!
అంతటి మహనీయుడైన… మన దర్శకరత్న దాసరి నారాయణరావు ఆత్మ శాంతించాలని కోరుకుంటూ…
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…