
ఎందుకంటే ఈ ‘విజువల్ వండర్’ ను నాణ్యమైన 4కే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ధియేటర్లో గానీ, వీలైతే ఐమాక్స్ భారీ సైజు స్క్రీన్లో గానీ ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవ్ కట్టా లాంటి వాళ్ళయితే… నెల రోజుల సమయం పట్టినా గానీ, ఈ సినిమాను మొదటి సారి ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లోనే చూడాలని భీష్మించుకుని కూర్చున్నారు. దీనికి సంబంధించి దేవ్ కట్టా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అంతలా హల్చల్ చేస్తున్న ఆ ట్వీట్లో ఏముందంటే…
ప్రస్తుతం ఐమాక్స్ లో “బాహుబలి 2” టికెట్ సంపాదించడం కన్నా ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం తేలికగా ఉందని ఛలోక్తి వేసిన దేవ్ కట్టా, ఒక నెల రోజుల సమయం పట్టినా సరే, మొదటిసారి మాత్రం ఐమాక్స్ లోనే చూస్తానని ట్వీట్ చేసారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉందంటే… ఇక సాధారణ ప్రేక్షకులు ఈ సినిమా టికెట్ల కోసం ఎంతగా పడి చస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. మరి దేవ్ కట్టా కోరిక ఎప్పటికి నెరవేరుతుందో? లేదంటే ఈ లోపున ఎమ్మెల్యే అయిపోయి అప్పుడు ఐమాక్స్ టికెట్ కొంటారేమో??
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…