
ఆయన సినిమాలు చూస్తే అంతంత మాత్రంగానే ఉంటాయి, రొమాంటిక్ కామెడీలు మాత్రమే కూసింత బెటర్‌గా ఉంటాయి. అదే ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చే తీరు చూస్తే చాలా గొప్ప ఫిల్మ్ మేకర్ అనే ఫీల్‌ని క్రియేట్ చేస్తారు. ఒకట్రెండు సార్లు ఆయన మాటల్ని నమ్మి మోసపోతారేమోగానీ, పదే పదే వినేవాళ్లు ఎవరూ ఉండరని అంటున్నారు నెటిజన్లు.
రీసెంట్‌గా వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా గురించే ఈ డిస్కషన్ అంతా. నైట్రో స్టార్ సుధీర్‌బాబు, ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి జంటగా నటించిన సినిమా ఇది. తనకు బాగా అలవాటైన, హిట్ తెచ్చిన సినిమాలో సినిమా అనే కాన్సెప్ట్ నే ఈ సినిమాకు కూడా నమ్ముకున్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. హీరోయిన్‌తో డ్యూయల్ రోల్ చేయించారు. మంచి లవ్‌ట్రాక్‌ని ప్లాన్ చేశారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ క్యాచీ టైటిల్ కూడా పెట్టారు. సినిమా చూసిన వారు కొన్ని విషయాలకు కనెక్ట్ అవుతున్నా గానీ, మెజారిటీ ‘ఆ అందులో కొత్తగా ఏముందని’ అని పెదవి విరుస్తున్నారు.
సినిమా రిలీజ్ అయి, డివైడ్ టాక్ రావడంతో మోహనకృష్ణ ఇంద్రగంటి ఇంటర్వ్యూలలో మాట్లాడే తీరు మీద, ఆయన ప్రమోషనల్ స్ట్రాటజీ మీద గట్టిగానే సెటైర్లు పడుతున్నాయి.
Exclusive Video Interviews: Watch & Subscribe
Is Sivakarthikeyan finally answering the old Sardar vs Prince fan war, four years later? His…
ప్రతీ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు... వాటి కోసం ఓ శాఖ, మంత్రి, వాటి పర్యవేక్షణకు వందలాది మంది అధికారులు,…