
తాను ఇప్పటికే సదరు నిర్మాణ సంస్థకు నోటీసులు పంపించానని, ఇది తొలి అడుగు మాత్రమేనని, నిర్మాతల నుంచి సరైన సమాధానం రాకుంటే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. యూఎస్ లేదా ఫ్రాన్స్ లోని కోర్టుకు నిర్మాతలను లాగుతానని అన్నారు. సినిమాను తాను చూసిన తరువాత కోపగించుకోలేదని, కానీ, చిత్రం విడుదలై నెల రోజులు గడిచినా నిర్మాతల నుంచి స్పందన రాకపోవడంతో ఆగ్రహం కలిగి నోటీసులు పంపానని తెలిపారు.
చిత్రంలోని ఎన్నో సీన్లు, లొకేషన్లు, డైలాగులు తన చిత్రం నుంచి కాపీ కొట్టారని ఆరోపించిన ఆయన, హారికా హాసినీ యాజమాన్యమే తన వద్దకు వచ్చేలా చేస్తానని అన్నారు. టీ-సిరీస్, ‘అజ్ఞాతవాసి’ టీమ్ మధ్య ఓ సెటిల్ మెంట్ జరిగినట్టు తనకు తెలిసిందని, తాను పలుమార్లు టీ-సిరీస్ ను సంప్రదించినా, సెటిల్ మెంట్ పై వారింకా స్పందించలేదని అన్నారు. తాను భారత హక్కులను మాత్రమే టీ-సిరీస్ కు విక్రయించానని, సినిమా విదేశాల్లోనూ విడుదలైనందున తానిచ్చిన హక్కులను మీరినట్టేనని, దీంతో టీ-సిరీస్ – హారికా హాసినీ క్రియేషన్స్ నిర్మాతల మధ్య జరిగిన సెటిల్ మెంట్ కోర్టుల్లో చెల్లబోదని అన్నారు.
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…
Prabhas has reached a point where the problem is no longer finding big films. It…