
మరి ఆ స్క్రిప్ట్ ఏమైంది? ఆ కధ ఏమైంది? అసలు క్రిష్ – ప్రిన్స్ కాంభినేషన్ లో సినిమా ఏమైంది? వీటన్నింటికి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్రిష్ జవాబు చెప్పారు. అప్పట్లో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమేనని, మొత్తం ప్లాన్ కూడా చేసుకున్నామని, ఈ లోపున మహేష్ ‘ఆగడు’ సినిమా పూర్తి చేస్తానని, ఆ తర్వాత చేద్దామని అనుకున్నామని, అలాగే హిందీలో ‘గబ్బర్’ గురించి అడుగుతున్నపుడు, మహేష్ – నమ్రతలే తన పేరును సంజయ్ లీలా భన్సాలికి చెప్పారని క్రిష్ స్పష్టం చేసారు.
అయితే అది పూర్తి చేసి రావడానికి తనకు రెండేళ్ళ సమయం పట్టిందని, ఆ తర్వాత ‘కంచె’ సినిమా చేయడం, ఇంతలో ‘శ్రీమంతుడు’ ట్రాక్ లోకి మహేష్ వెళ్ళడంతో, అప్పుడు అనుకున్న కధను పక్కన పెట్టేసానని, మహేష్ కోసం మరో స్క్రిప్ట్ ను అనుకుంటున్నానని, మహేష్ తో ఖచ్చితంగా ఓ సినిమా చేయాలని ఉందని తన అనుభూతులను, “శివం” సినిమా స్క్రిప్ట్ ‘మిస్టరీ’ని బయటపెట్టారు క్రిష్. దీంతో క్రిష్ సినిమాపై ప్రిన్స్ ఫ్యాన్స్ కు కాస్త క్లారిటీ వచ్చినట్లయ్యింది.
After the back to back failures of Jolly O Gymkhana and Badass Ravi Kumar, Prabhu…
Another Netflix thriller with an interesting premise has arrived, but Gandhari is receiving mostly negative…