
వీరికి తోడు టాప్ నిర్మాతలు, రచయితలు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు… అలాగే రాజకీయ రంగం నుండి కూడా ప్రముఖ నేతలు విచ్చేసారు. అయితే వీరెవరూ క్రిష్ వివాహంలో హైలైట్ కాలేదు. ఎక్కడా ఉన్నా హంగామా సృష్టించే మంచు వారమ్మాయి లక్ష్మీ ప్రసన్న చేసిన హంగామానే క్రిష్ పెళ్లిలో సర్వత్రా చర్చనీయాంశం కావడం విశేషం. సాధారణంగా పెళ్ళికి వెళితే… చేతులు జోడించి నమస్కారాలు పెట్టి, నూతన వధూవరులకు విషెస్ చెప్తారు. లేదు సినీ పరిభాషలో చెప్పాలంటే ఓ హాగ్ ఇచ్చి వారి యొక్క బంధాన్ని చాటి చెప్తారు.
కానీ, లక్ష్మీ ప్రసన్న ఏం చేసిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. జంట వద్దకు వెళ్ళిన ప్రసన్న, వెళ్లి క్రిష్ ఒడిలో కూర్చోవడంతో అంతా అవాక్కయ్యారు. చూడడానికి సరదాగా చేసిన విషయంలాగానే కనపడుతున్నా… కొత్త పెళ్లికూతురు పక్కన ఉండగా నేరుగా వెళ్లి క్రిష్ ఒడిలో కూర్చోవడం సరికొత్త ట్రెండ్ కు దారి తీస్తుందేమో గానీ, మంచు వారమ్మాయి హంగామా హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా హల్చల్ చేస్తోంది.
ఇంకా చెప్పాలంటే… ఈ ఫోటోలో వెనుక ఉన్న ఓ ఇద్దరి హావభావాలను గమనిస్తే… లక్ష్మీ ప్రసన్న చేసిన ‘సరదా’ ఏంటో అందరికీ అర్ధమవుతుంది. పెళ్లిలో జరిగే హంగామా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది గానీ, ఇప్పటివరకు ఎవరి పెళ్లిలోనూ, ఈ విధంగా ఎవరూ అభినందనలు తెలుపకపోవచ్చు. అందుకే… ఈ ఫోటో ‘తప్పక చూడాల్సిన’ జాబితాలోకి చేరిపోయింది.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…