Telugu

సినిమా కబుర్లు: వీటికి కూడానా..?

మొదటిగా యానిమల్ మూవీ దర్శకుడు సందీప్ వంగా ఎదో ఒక విధంగా నిత్యం వార్తలలో ఉంటున్నారు. “ఒకసారి వివాదంతో అయితే మరో సారి వివరణతో” ఇలా తన సినిమా యానిమల్ ను ప్రచారంలో ఉంచుతున్నారు. తాజాగా యానిమల్ మూవీ పై తన భార్య స్పందనను తెలియచేసారు వంగా.

స్త్రీ పాత్ర గురించి ఎటువంటి నెగటివ్ కామెంట్ చేయలేదని, రక్తపాతం ఎక్కువగా ఉన్న సీన్లు తనకు నచ్చలేదని, అలాగే తన కుమారుడికి కొన్ని సీన్లు ఎడిట్ చేసి చూపించడం జరిగిందని సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ ప్రచారానికి తగ్గట్టే మూవీ కూడా ఒక్కో రికార్డ్ ను బ్రేక్ చేస్తూ ముందుకు వెళుతుంది. ఓటిటిలో విడుదలైన పది రోజులలోనే 3 .93 కోట్ల వ్యూవర్ షిప్ తో RRR రికార్డు ను బ్రేక్ చేసింది యానిమల్ మూవీ.

ADVERTISEMENT

అలాగే సిద్దు జొన్నలగడ్డ పుట్టిన రోజు సందర్భంగా డీజే టిల్లు స్వేర్ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. డీజే టిల్లు లో రాధికతో కలిసి థియేటర్లలో సిద్దు చేసిన రచ్చ ఇప్పుడు అనుపమతో కొనసాగిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. ఫిబ్రవరీ 14 వాలంటైన్స్ డే రోజు ఈ సినిమా ట్రైలర్ ను, మార్చి 29 సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

లైగర్ గా వచ్చి తన అభిమానులను కూడా భయపెట్టిన విజయ్ దేవరకొండ ఈ సారి ఫామిలీ స్టార్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విజయ్ కెరీర్ లో మరో విజయాన్ని తెచ్చిపెడుతుంది అనే ఆశతో ఉన్నారు విజయ్ ఫాన్స్. ఈరోజు చిత్ర యూనిట్ విడుదల చేసిన మెలోడీ సాంగ్ ‘ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా’ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీలో విజయ్ సరసన తాజా క్రేజీ హీరోహిన్ మృణాల్ పాండే నటిస్తున్నారు.

చివరిగా,జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విడుదలైన యాత్ర 1 సైలెంట్ గా వచ్చి తన పని తాను చేసుకుపోయింది. కానీ జగన్ అధికారంలో ఉండగా విడుదలకు సిద్దమైన ఈ యాత్ర 2 మాత్రం రోజుకో రకంగా ఇటు వార్తలలో, అటు వివాదాలలో నిలుస్తుంది. యాత్ర సినిమా యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక విలేకరి ఈ సినిమాలో జగన్ పరదాల ప్రస్తావన తీసుకువచ్చారా అంటూ అడిగిన ప్రశ్న సోషమీడియాలో వైరల్ అయ్యింది.

అలాగే ఈ సినిమాకు కౌంటర్ గా విడుదలైన రాజధాని ఫైల్స్ మూవీ కూడా ఈ యాత్రను చర్చలో ఉంచింది. ప్రభుత్వ అండతో, ఒక సీక్వెలా యాత్ర 1 కు కొనసాగింపుగా వస్తున్న యాత్ర మూవీ ట్రైలర్ కు 4 రోజులకు 4 మిలియన్ల వ్యూస్ వస్తే ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా నటీనటులు ఎవరో కూడా తెలియకుండా విడుదలైన రాజధాని ఫైల్స్ మూవీ కి 10 గంటలలోనే 5 మిలియన్ వ్యూస్ సాధించింది.

అయితే తాజాగా మరో వివాదం ఈ యాత్రను మళ్ళీ వార్తలలోకి తెచ్చింది. ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల సాయంతో ఊర్లలో ఈ సినిమా టికెట్లను పంచుతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. పార్టీ ప్రచారానికి వాలంటీర్లే, సినిమా ప్రమోషన్లకు వాలంటీర్లేనా..? అంటూ సామాజిక మాధ్యమాలలో వైసీపీ ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇదంతా మీడియా సృష్టే అంటూ కొట్టిపడేసారు యాత్ర దర్శకుడు మహి రాఘవ.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కేటీఆర్‌ కొత్త పేపర్ ఖరీదు రూ. 188 కోట్లు: కవిత

కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు నిజమేనని టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత…

21 minutes ago

Anandi’s Emotional Reality Check on Film Politics

The film industry is not as glamorous as it looks from the outside. Behind the…

26 minutes ago