Telugu

కేటీఆర్‌ కొత్త పేపర్ ఖరీదు రూ. 188 కోట్లు: కవిత

కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు నిజమేనని టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధృవీకరిస్తున్నట్లు ఓ కొత్త స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ, “కేటీఆర్‌ రూ.188 కోట్లతో ‘పయోనీర్’ అనే ఇంగ్లీషు పత్రిక కొన్నారు. ఇంతకాలం తెలుగు పత్రికతో చెప్తున్న అబద్దాలు చాలవన్నట్లు ఇప్పుడు ఇంగ్లీషులో కూడా అబద్ధాలు చెప్పబోతున్నారు. కేటీఆర్‌ దానిని కొన్నారు కనుక ఇకపై దానిలో బీఆర్ఎస్‌ వార్తలే ఉంటాయి. కనుక వాటిని చదివి ఎవరూ మోసపోకండి.

ADVERTISEMENT

అయినా రాజకీయాలు చేయాలంటే ప్రజాబలం, గుండె ధైర్యం ఉండాలి కానీ ఇలా పత్రికలు, న్యూస్ ఛానల్స్, యూట్యూబ్‌ ఛానల్స్, సోషల్ మీడియా కాదు. డబ్బుంటే అవసరమైన చోట చూపించుకోండి. ఇక్కడ జరిగిన సభకు కేటీఆర్‌ హెలికాఫ్టర్‌లో వచ్చారు కదా? కానీ మాకు అంత డబ్బు లేదు కనుక కార్లలో నేలపైనే తిరుగుతాం,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.

కల్వకుంట్ల ఆస్తులపై కమిటీ ఏర్పాటు, దీంతో విచారణ అంటూ చాలా హడావుడి చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ తర్వాత పూర్తిగా చల్లబడి పోయినట్టే ఉంది.

అదంతా ప్రజల దృష్టి మళ్ళించేందుకు రెండు పార్టీలు కలిసి ఆడుతున్న కొత్త డ్రామా అని ఆనాడే కల్వకుంట్ల కవిత అన్నారు. అదే నిజమేమో?

దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో టాప్ హీరోగా వరుసపెట్టి సినిమాలు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ జనసేన పార్టీ నిర్వహణ ఖర్చులు తట్టుకోలేక మళ్ళీ సినిమాలు చేయాల్సి వచ్చిందని స్వయంగా చెప్పుకున్నారు.

కానీ ఏ పదవి, అధికారం, పెద్దగా ఆస్తులు లేవని చెప్పుకునే కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్‌ పార్టీని ఎలా స్థాపించగలిగారు? పలు జిల్లాలలో భారీ బహిరంగ సభలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు. వందల కార్లతో ర్యాలీలు ఎలా చేయగలుగుతున్నారు? వీటన్నిటికి డబ్బు ఎక్కడిది? అనే సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

కానీ తన కంటే అన్న ధనవంతుడని నిరూపించేందుకు ఆమె బయటపెట్టిన ఈ కొత్త పేపర్ విషయం, కల్వకుంట్ల కుటుంబ ఆస్తుల గురించి సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనని ధృవీకరిస్తున్నాయి కదా?

ఆ ఆస్తుల పంపకాలలో తేడా రావడంతో కేటీఆర్‌ ఆమెను బయటకు పంపించేశారని సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలు కూడా నిజమేనని భావించేలా ఉంది కదా కల్వకుంట్ల కవిత ఇచ్చిన ఈ తాజా స్టేట్‌మెంట్‌?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Anandi’s Emotional Reality Check on Film Politics

The film industry is not as glamorous as it looks from the outside. Behind the…

13 minutes ago

జనసేనకు పరీక్ష.. వైసీపీకి గొప్ప అవకాశం!

టీడీపి-జనసేనల మద్య సీట్ల సర్దుబాట్లు కొలిక్కి వచ్చాయి. జనసేన కోరుకున్నట్లే విజయవాడ, ఏలూరు, కాకినాడ, శ్రీకాకుళం నగరపాలక సంస్థలు, మరో…

13 minutes ago