Telugu

హీరో… డైరెక్టర్… చిచ్చు పెట్టిన బడ్జెట్..!

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ‘గరుడ వేగ’ ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపద్యంలో… తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ కి.. తనకి మధ్య జరిగిన గొడవ గురించి చెప్పుకొచ్చారు. ‘రొటీన్ లవ్ స్టోరీ’కి నేను దర్శకుడిగా వున్నాను… సందీప్ కిషన్… ఆయన ఫ్రెండ్ నిర్మాతలుగా వున్నారు. చివరి నిమిషంలో ఆ ఫ్రెండ్ పక్కకి తప్పుకోవడంతో, ఆ బాధ్యతను నేను స్వీకరించడానికి సిద్ధమయ్యాను అని తెలిపారు.

ADVERTISEMENT

“ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ ను ఉత్తరాఖండ్ లో చిత్రీకరించాం. షూటింగ్ కోసం బయటికి వెళ్లినప్పుడు కొంత ఖర్చు పెరగడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అలా అక్కడ అదనంగా ఓ 15 లక్షలు ఖర్చు చేయవలసి వచ్చింది. బడ్జెట్ ఎక్కువైపోతోందంటూ సందీప్ కిషన్ అసహనాన్ని వ్యక్తం చేయగా… నేను సర్ది చెప్పాను. అయినా ఆయన వినిపించుకోకపోవడంతో మాటా మాట పెరిగింది… దాంతో ఆయన వాటా వెనక్కి ఇచ్చేశాను. ఇప్పుడు ఇద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AOT Radhe Unplugged: DQ Surprises With His Singing

Dulquer Salmaan has sung an unplugged version of the Radhe Radhe song from Aakasamlo Oka…

5 minutes ago

Nara Lokesh Assures Full Support for Rapthadu Schoolgirl

Andhra Pradesh Education and IT Minister Nara Lokesh has assured the family of the Rapthadu…

11 minutes ago