
ఇతర సినిమాలకు సంబంధించి తనకు ఏది నచ్చినా… సోషల్ మీడియా ద్వారా వెల్లడించే జక్కన్న, తాజాగా “స్పైడర్” టీజర్ పై కూడా కామెంట్స్ చేసారు. “స్పైడర్” అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తమకు ఇప్పుడు అర్ధమైందని, చాలా రహస్యంగా ఉందని, ఈ మెరుపు బాగుందని తన సందేశాన్ని పోస్ట్ చేసారు. అయితే ఇక్కడ ప్రేక్షకుల నాడి ఎలా పట్టుకున్నారు అని చెప్పడానికి… టైటిల్ పై రాజమౌళి చేసిన కామెంట్స్ ను అర్ధం చేసుకోవచ్చు. ‘స్పైడర్’ టైటిల్ ప్రకటించగానే, ‘మహేష్ సినిమాకు ఇదేం టైటిల్’ అంటూ భిన్న స్పందనలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
అందులో రాజమౌళి కూడా ఉన్నారన్న విషయం ఈ ట్వీట్ తో అర్ధమైంది. అంటే ఒక సామాన్య ప్రేక్షకుడి లాగానే ఆలోచనలు చేస్తాడు కాబట్టి, ఆ సామాన్యుడికి కావాల్సిన విందు, వినోదాన్ని అందించడంలో అందరి కంటే రాజమౌళి ముందుంటున్నారని అవగతం చేసుకోవచ్చు. రాజమౌళి అన్నట్లు… ఈ సినిమాకు “స్పైడర్” అనే టైటిల్ ఎందుకు పెట్టారో, నిజంగానే ప్రపంచానికి ఈ రోజు తెలిసి వచ్చింది. ఇక ఈ టీజర్ పై నెట్టింట వారు, వీరు అన్న తేడా లేకుండా అందరు హీరోల అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు 'నిన్ను అసెంబ్లీ గేటు…
One of the crucial indicators of the potential lifetime performance of any film is based…