
అదేంటి అంటే ఈ సినిమా సాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ మొత్తాన్ని ఒక ప్రముఖ టీవీ ఛానెల్ ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 132 కోట్లకు కొనుక్కుందట. కట్ చేస్తే సౌత్ ఇండియా లోనే అంత భారీ రేట్ కి అమ్మడైన సినిమాగా ఈ సినిమా రికార్డు కెక్కినట్లే.
ఎందుకంటే తాజాగా శంకర్ తీసిన రోబో-2 కూడా అన్ని భాషల్లో కలిపి సాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ 108 రేటు పలికిందట. అంటే రోబోతో పోలిస్తే రాజమౌళి సినిమా టాప్ ప్లేస్ లో నిలబడ్డట్లే.
ఇక మరో పక్క ఈ మ్యాటర్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో యధావిధిగా రాజమౌళీ vs శంకర్ అంటూ రచ్చ మొదలయ్యింది. ఇక ఇదిలా ఉంటే ఇక్కడ ఈ సినిమాలో ఉన్న విశేషమే ఈ భారీ డిమాండ్ కి కారణం అని స్పష్టంగా చెప్పవచ్చు.
అదేంటి అంటే ఒకటి బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా కావడం, మరో పక్క యువ మాస్ హీరోలు ఎన్ఠీఆర్, మరియు చరణ్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తూ ఉండడం. మొత్తంగా ఈ ముగ్గురు కలసి రచ్చ రంబోలా చెయ్యడం ఖాయంగానే కనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.
Vijay Deverakonda’s strong response to the trolling surrounding his relationship with Rashmika Mandanna has triggered…
Telangana's Tummidihatti project has triggered a fresh political confrontation between the Congress government and the…