
‘ఒక ప్రేమ కధను ఇంత థ్రిల్లింగ్ గా చెప్పవచ్చా’ అనే రీతిలో ఈ స్క్రిప్ట్ ఉందని, ‘మేకింగ్ లో ఉన్నపుడే స్క్రిప్ట్ తెప్పించుకుని మొత్తం చదివానని, సినిమా అంతా కామెడీగా, సరదాగా అనిపించిన స్క్రిప్ట్ క్లైమాక్స్ కు వెళ్ళేపాటికి ఏడిపించిందని, ఈ అనుభూతిని ఎలా తెలియజేయాలో తెలియక, కన్నీళ్ళతో కూడుకున్న తన కళ్ళను ఫోటో తీసి శ్రీనివాస్ కు పంపించానని’ సుకుమార్ చెప్పిన సంగతులు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాను వరుసగా మూడు షోలు చూశానని, అంతగా ఆ సినిమా నచ్చేసిందని, ఈ సినిమా స్క్రిప్ట్ చదివిన తర్వాత కూడా అంతే విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందని, కొత్తదనంతో నిండుకుని ఉన్న కధలను నిర్మించడంలో నిర్మాత సాయి కొర్రపాటి సిద్ధహస్తులుగా మారారని, కళ్యాణ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ అని చిత్ర యూనిట్ కు ముందస్తుగా అభినందనలు తెలిపారు.
Nabha Natesh turns classic Indian glamour into a striking fashion statement with this fiery rust…
Ekta Kapoor is taking a major gamble with Balaji Telefilms, and this time, television is…