
ఈ విభాగంలో హీరోయిన్ దిశా పటాని ముందు వరుసలో నిలుస్తోంది. ఇటీవలే తన ఫిట్ నెస్ స్థాయిని చాటిచెప్తూ విడుదల చేసిన పలు వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపరచగా, తాజాగా వాటికి సీక్వెల్ గా మరో వీడియోను రిలీజ్ చేసారు. సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రాలతో కలిసి నటిస్తోన్న “భరత్” ఫిల్మ్ కోసం రిహార్సల్స్ చేస్తోన్న దిశా పటాని వీడియోకు వీక్షకులు ఫ్లాట్ అవుతున్నారు.
ఒక సినిమా కోసం దిశా పటాని చూపుతున్న డెడికేషన్, చేస్తోన్న హార్డ్ వర్క్ ఒలంపిక్స్ కోసం గనుక కష్టపడితే, ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తెచ్చేది అంటున్నారు సినీ జనాలు. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకుంటోన్న దిశా, తెలుగులో పూరీ జగన్నాధ్ – వరుణ్ తేజ్ ల “లోఫర్” సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్ కెరీర్ ‘లోఫర్’ వద్దే ఆగిపోయింది.
Srijita Ghosh brings a fresh dose of drama to ethnic dressing, and the setting makes…
After the massive success of Jailer 2, all eyes are now on Nelson Dilipkumar's next…