Telugu

మద్యం కుంభకోణం: రాజకీయ కాలక్షేపమేనా?

ఢిల్లీ మద్యం కుంభకోణం బయటపడినప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏపీ మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో వేలకోట్ల అవినీతి జరిగిందని ప్రాధమిక సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు ఏపీ సిట్ అధికారులు.

ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, ఆ సంస్థలో ఓఎస్‌డీగా చేసిన సత్యప్రసాద్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు కస్టడీ, విచారణ, రిమాండ్‌ వివిద దశలలో ఉన్నారు.

ADVERTISEMENT

తాజాగా ఈ కేసులో ఏ-6గా నిందితుడు ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని ఏపీ పోలీసులు శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి విజయవాడకు తీసుకు వచ్చారు. ఈ కేసులో ఆయనకి ఏసీబీ కోర్టు మే 6 వరకు రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆయనని జైలుకు తరలించారు.

ఈ కేసులో విచారణకు హాజరైనవారు, అరెస్ట్‌ అయినవారు అందరూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోసమే ఈ అవినీతికి పాల్పడ్డామని ముక్త కంఠంతో చెపున్నారు. అయినా సిట్ అధికారులు జగన్‌ దారిదాపులకు కూడా వెళ్ళలేకపోయారు.

ఈ సందర్భంగా మూడు అతి పెద్ద కేసులు, వాటి తదనంతర పరిణామాల గురించి చెప్పుకుంటే ఈ కేసు ఏవిదంగా సాగి ముగియబోతోందో అర్దం చేసుకోవడం తేలికవుతుంది.

1. అక్రమాస్తుల కేసులు, 2. ఢిల్లీ మద్యం కుంభకోణం, 3. వివేకా హత్య కేసు.

ఈ మూడు కేసులలో కూడా నిందితులపై కేసులు నమోదయ్యాయి. షరా మామూలుగా విచారణలు, అరెస్ట్‌, రిమాండ్‌, బెయిలు ఎపిసోడ్స్ అన్నీ సాగాయి. చివరికి ఒకరొకరుగా అందరూ బయటకు వచ్చేశారు. న్యాయం ధర్మం గెలిచ్చాయంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చేసి హాయిగా రాజకీయాలు చేసుకుంటున్నారు.

వారిలో కొందరు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి పదవులు కూడా చేపట్టారు. చట్ట సభలలో కూర్చొని చట్టాలు చేశారు. వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన పోలీసులే వారికి రక్షణ కల్పిస్తున్నారు. తాము అరెస్ట్‌ చేసిన వారికే పోలీసులు సెల్యూట్స్ కొట్టక తప్పడం లేదు. ఇప్పుడు ఆ కేసులన్నీ అటకెక్కిపోయాయి లేదా ఆటకెక్కించేందుకు న్యాయపోరాటాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపధ్యంలో ఏపీ మద్యం కుంభకోణం కేసులో జరుగుతున్న పరిణామాలను చూసినట్లయితే ఇది కూడా ఇలాగే సాగి ముగియబోతోందని స్పష్టమవుతోంది.

అలా జరుగదు.. జరుగకూడదని కూటమి ప్రభుత్వం, సిట్ అధికారులు భావిస్తే ఈ మద్యం కుంభకోణం కేసులో విచారణ స్పీడు పెంచి ప్రధాన సూత్రధారిని బోనులోకి రప్పించి బందించవలసి ఉంటుంది. లేకుంటే ఈ కేసులు, విచారణలు, రిమాండ్లతో ఒరిగేదేమీ ఉండదు. చివరికి ఇదంతా ప్రజాధనంతో చేసిన రాజకీయ కాలక్షేపంగా మిగులుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

15 minutes ago

No Relief At Supreme, But AP Set For Poll Battle

A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…

45 minutes ago