
గడిచిన రెండు రోజుల నుంచి అటు సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్టీమ్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వంటలక్క కుమారి ఆంటీ ఇష్యూ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభం కార్డు ఏశారు.
తెలంగాణలో వ్యాపారం చేసుకుంటున్న కుమారి ఆంటీకి జగన్ ప్రభుత్వం ఏపీలో భూమి కేటాయించిందని, జగన్ గొప్ప మనస్సు ఏంటో ఇప్పటికైనా తెలుసుకోవాలంటూ వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వానికి జాకీలు లేపే పనిలో పడ్డారు. అయితే ఇప్పటికే పాపులర్ అయిన కుమారి ఆంటీ స్టాల్ కు ఇప్పుడు ఈ అదనపు ప్రచారం తోడవడంతో అక్కడ రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
అయితే ట్రాఫిక్ అడ్డంకులను తొలగించడానికి ఆ ప్రాంతం నుండి కుమారి ఆంటీని ఖాళీ చేసి వెళ్లిపోవాలని పోలీస్ శాఖ ఆదేశించింది. దీనితో పక్క రాష్ట్రంలో రోడ్డు సైడ్ వ్యాపారం చేసుకుంటున్న మహిళ పై రేవంత్ ప్రభుత్వం కక్ష సాధింపుకి దిగిందని, కుమారి ఆంటీ కుటుంబం వైసీపీ పార్టీకి మద్దతుగా ఉండడం వలనే రేవంత్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంటూ అటు వైసీపీ మద్దతుదారులు, ఇటు బ్లూ మీడియా సొంత కథనాలు వండి వడ్డించడం మొదలుపెట్టింది.
అయితే వీరి ప్రచారాలు ప్రజలను చేరే లోపే ముఖ్యమంత్రి రేవంత్ సమస్యను చక్కదిద్దేసారు. దానితో ఇక సొంత కథనాలు రాయలేక ఉన్న వాస్తవాలను చెప్పాల్సిన పరిస్థితి సదరు మీడియా వారికీ ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూనే సదరు వ్యాపారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ వారిదే అంటూ రేవంత్ చిరు వ్యాపారి కోసం తన ప్రభుత్వ అధికారుల నిర్ణయాన్ని సైతం వ్యతిరేకించారు.
అక్కడితో ఆగకుండా సదరు స్టాల్ దగ్గరకు త్వరలోనే నేను కూడా వెళతాను అంటూ రేవంత్ చెప్పడంతో ప్రజాపాలన అంటే ఈ విధంగా ఉండాలి, ప్రజలకు ఇబ్బంది కలిగేలా, వారికీ నష్టం చేకూరేలా అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా వారిని వారించి ప్రజల తరుపున నిలవడమే ముఖ్యమంత్రి పదవి తగ్గ గౌరవం. ఇప్పుడు ఆ గౌరవాన్ని రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు అంటూ రేవంత్ నిర్ణయం పై రెండు రాష్ట్రాలలో ప్రశంసల వెల్లువ మొదలయ్యింది.
ఒక చిరు వ్యాపారి కష్టానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్పందించిన తీరు, తీసుకున్న నిర్ణయం ఆదర్శనీయం అంటూ కొనియాడుతున్నారు. అలాగే అటు సాక్షి మీడియా కూడా రేవంత్ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేయడం విడ్డురంగా అనిపిస్తోంది అంటున్నారు ఏపీ ప్రజలు. తన కుటుంబ జీవనాధారం పోతుంది అని బాధపడుతున్న ఒక చిరు వ్యాపారి కష్టాన్ని గుర్తిస్తే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏస్థాయికి దిగి నిర్ణయాలు తీసుకుంటారో రేవంత్ రెడ్డి తన పాలనలో తెలియచెప్పారు.
కానీ, గడిచిన 1500 రోజుల నుంచి తమ ఆవేదన అర్ధం చేసుకోవాలంటూ, కనీసం తమ గోడు వినిపించుకోవాలంటూ రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాలు రోడ్డు మీద పడి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ముఖ్యమంత్రి జగన్ కానీ ఆయన మంత్రి మండలి సభ్యులు కానీ వారి బాధ పట్టించుకోలేదు సరికదా వారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ హేళన చేసారు, లాఠీ దెబ్బలు రుచి చూపించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ, మున్సిపల్ కార్మికుల సమస్యల మీద కూడా అలాగే ప్రవర్తించారు.
కుమారి ఆంటీ మీద ఇంత ప్రేమ చూపించి ఆమెకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వంటలక్కకి మద్దతుగా కధనాలు ప్రచారం చేసిన సాక్షి అమరావతి రైతుల వ్యథలను కూడా ప్రచారం చేయగలదా..? అంత దమ్ము ధైర్యం సదరు మీడియా వారికీ ఉన్నాయా..? అంటూ అదే సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వం పై, బ్లూ మీడియా పై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఎవరైనా వారి బతుకు తెరువుని, నోటి కాడ ముద్దను లాక్కుంటున్నారు అంటే రోడ్డు మీదకు రావడం సహజం.
దానికోసం వారు మనకు వ్యతిరేకులు, వారికీ ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందించకూడదు అనుకుని ముందుకెళ్తే ముఖ్యమంత్రి ఏ స్థాయికి వెళ్లి నిర్ణయాలు తీసుకుంటారో జగన్ పాలనలో తెలిసొచ్చింది. ప్రజా సమస్యల మీద ఏవిధంగా స్పందించాలో ఒకరు, ఏవిధంగా ప్రవర్తించకూడదో మరొకరు రెండు రాష్ట్రాల ప్రజలకు కనువిప్పుచేశారంటూ సామాజిక మాధ్యమాలలో ఇద్దరు ముఖ్యమంత్రుల మీద తమ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…
Vijay Deverakonda has an interesting history at the box office with Rajinikanth. On two previous…