రాజకీయం ముసుగులో వైసీపీ చేస్తున్న అరాచకానికి, మహిళల పట్ల ఆ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ఉన్మాద పోస్టులకు ఏ పేరు పెట్టాలో కూడా అర్ధం కానంత దారుణంగా పరిస్థితులు మారిపోయాయి.
ఎడారిలో తవ్వే కొద్దీ ఇసుక భయటపడుతున్నట్లు, వైసీపీ సోషల్ మీడియా పై విచారణ జరిపే కొద్దీ సోషల్ సైకోలు గుట్టలుగుట్టలుగా బయటకొస్తున్నారు. గత ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి నాయకత్వ అండతో ఆయన సొంత సామజిక వర్గానికి చెందిన కొంతమంది సైకోలు సమాజాన్ని ఏమేరకు కలుషితం చేశారో చూస్తే ఒక్కొక్కరి రక్తం మరిగిపోతుంది.
ఇందులో ముఖ్యంగా జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డి చేసిన దారుణాలు ఉగ్రవాదులకంటే తక్కువేమి కాదనే చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వంలో అధినేతల సహకారంతో ఈ ప్రబుద్దుడు ఎంతోమంది సాధారణ వ్యక్తులను సైకోలుగా మార్చి సోషల్ మీడియాలో వదిలి సమాజాన్ని అన్ని రకాలుగా నాశనం చేసారు. తన పైశాచికం చల్లార్చుకోవడానికి ఎంతోమంది జీవితాలను బలిపీఠం ఎక్కించారు జగన్ అండ్ కో.
ఇందులో రెడ్డి గారి అమ్మాయి అంటూ ఒక్కరు, శ్రీ రెడ్డి అంటూ మరొకరు, వర్రా రవీంద్రా రెడ్డి, పంచ్ ప్రభాకర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, కళ్లెం కృష్ణా రెడ్డి ఇలా ఈ రెడ్డి గారులందరు కలిసి జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసం ప్రత్యర్థి పార్టీ నేతలందరి పైన అసభ్యకర పోస్టులు పెడుతూ వారి కుటుంబసభ్యులను కించపరిచేలా మార్ఫింగ్ ఫోటోలను ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందారు.
అయితే వైసీపీ ప్రభుత్వంలో మొదలైన వీరి అరాచకం జగన్ పతనంతో అంతమవ్వకుండా మరో మెట్టు ఎక్కించి తన తీవ్రతను పెంచుకుంటూ పోయి ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మునుపెన్నడూ లేని విధంగా ఈ సోషల్ మీడియా ఉగ్రవాదాన్ని వైసీపీ పెంచి పోషించి సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బ తీశారు.
తల్లి, చెల్లిని కూడా ఉపేక్షించ కుండా వైసీపీ చేస్తున్న ఈ జగన్నాటకాన్ని రాజకీయం అనాలా.? లేక ఉన్మాదం అనాలా.? ఒక ఉగ్రవాద సంస్థ మాదిరి మంచి చెడులు తేడా లేకుండా, ఉచ్ఛం నిచ్చం మరిచి, వావి వరుస తో సంబంధం లేకుండా, మహిళలనే కనీస సంస్కారం లేకుండా రాజకీయం ముసుకు వేసుకుని అధికారం అనే ఆయుధం తో ఇక ప్రభుత్వం మాదే అనే అతి విశ్వాసంతో గత ఐదేళ్లు రెచ్చిపోయి ఇతరులను రెచ్చకొట్టిన వీరందరికి వారి పాపాలకు తగ్గ శిక్షలు పడాల్సిందే.
దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక యజ్ఞంలా సాగుతున్న ఈ వైసీపీ సోషల్ మీడియా ఉగ్రవాద అణిచివేత కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసి సమాజానికి పట్టిన ఈ చీడను ఇక్కడితో వదిలించాలి.
అలాగే వైసీపీ పార్టీ కి సంబంధించిన నేతల కుటుంబ సభ్యుల మీద కానీ వారి ఇంట్లో మహిళల మీద కానీ మరెవరైనా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినా, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేసినా వారి మీద కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహిరిస్తుంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలను కూడా అధికారులు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి.
India has emerged as one of the biggest digital currency markets in the world thanks…
Sobhita Dhulipala doesn't think love should be limited to romance. For her, friendship is a…