
డోనాల్డ్ ట్రంప్ దుందుడుకుతనం, ఆలోచనా విధానం, నిర్ణయాలు, పాలన ఏవిధంగా ఉంటాయో ఒకసారి అమెరికా ప్రజలు రుచి చూసిన తర్వాత కూడా అమెరికన్లు మళ్ళీ ఆయనకు అధికారం కట్టబెట్టారు. అంటే అమెరికన్లు కూడా సగటు భారతీయుల్లా మాయమాటలు నమ్మి మోసపోతారని స్పష్టమైంది.
వివిధ దేశాల నుంచి వచ్చిన విదేశీయులు అమెరికాలో ఉన్నత స్థాయికి ఎదిగి దర్జాగా జీవిస్తున్నారు. కానీ తమ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందనే సగటు అమెరికనలు భావించడం సహజం. వారి ఆ భావనని ట్రంప్ బాగానే క్యాచ్ చేశారు. అందుకే ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో వారిని ఆకట్టుకొని మళ్ళీ రెండోసారి అధ్యక్షుడు కాగలిగారు.
అయితే ఎన్నికలప్పుడు అయన చెప్పిన ‘అమెరికా ఫస్ట్’ నినాదానికి అర్థం వేరు. అధ్యక్షుడయ్యాక దాని అర్థం వేరన్నట్లు ఉంది ట్రంప్ తీరు.
దాంతో ఆయన తమకు ఏదో గొప్ప మేలు చేస్తారని సామాన్య మధ్య తరగతి అమెరికన్లు అనుకుంటే, ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సాధించి ‘అమెరికా ఫస్ట్’ అనిపించుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.
ఆయన నిర్ణయాలు, మాటలు, చర్యలే ‘అమెరికా ఫస్ట్’ అంటే అర్థం వేరే అని చెపుతున్నాయి కదా? కనుక ఆయన పాలన గురించి తాము ఊహించుకున్న దానికి జరుగుతున్న దానికి ఎక్కడా పొంతన లేదని అమెరికన్లకు పూర్తిగా అర్ధమయ్యే ఉంటుంది.
అమెరికన్లు ట్రంప్‌ని అమెరికా పాలించడానికి ప్రజలు ఎన్నుకుంటే, ఆయన ఇరాన్‌తో యుద్ధం చేస్తున్నారు. ఇందుకు అయనతో సహా కుటుంబ సభ్యులు ప్రాణభయంతో జీవించాల్సిన దుస్థితి చేజేతులా కల్పించుకున్నారు కూడా.
ట్రంప్ కేవలం అమెరికాని ఉద్దరిస్తే సరిపోయేది. కానీ చిత్ర విచిత్రమైన నిర్ణయాలతో అమెరికాతో సహా యావత్ ప్రపంచ దేశాలను అల్లకల్లోల్లం చేస్తున్నారు.
అత్యంత శక్తివంతమైన, తిరుగులేని అధికారాలు కల్పించే ఆ గద్దెపై అమెరికన్లు ఆయనని కూర్చోబెట్టారు. కనుక దిగిపోయే వరకు ఆయనని భరించాల్సిందే తప్పదు. కానీ ఆయన దిగిపోయేలోగా భారత్‌తో సహా ప్రపంచ దేశాలలో ఎన్ని లక్షల మంది రోడ్డున పడతారో!
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…