
అయితే అలా ఎదురుచూస్తున్న వారికి మరోసారి షాక్ ఇచ్చే న్యూస్ సిద్ధమవుతోందని ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పరోక్షంగా చెప్పకనే చెప్తున్నారు. ఈ సినిమాలో ప్రిన్స్ క్యాండిడ్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను టీజ్ చేస్తున్న సంతోష్ శివన్, తాజాగా ఓ ప్రిన్స్ అభిమాని అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ‘ఫస్ట్ లుక్ కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?’ అని ఓ అభిమాని అడుగగా, ‘ఆ పని మీదే ఉన్నారు, దాని కోసం కొన్ని ఫోటోలను తీసాను’ అంటూ బదులిచ్చారు.
అలాగే ‘ఏప్రిల్ 14వ తేదీనైనా ఫస్ట్ లుక్ ను ఆశించవచ్చా?’ అని మరో అభిమాని ప్రశ్నించగా, ‘నేనొక్కటే చెప్పదలుచుకున్నాను… మహేష్, మురుగదాస్ లు మీ కోసమే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పని చేస్తున్నారు… కాస్త సహనంగా ఉండండి…’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో ఏప్రిల్ 14వ తేదీన కూడా ఫస్ట్ లుక్ విడుదల అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక, 14 దాటితే ఇప్పట్లో ఇటు తెలుగులో గానీ, అటు తమిళంలో గానీ ఎలాంటి పండగలు లేకపోవడం అభిమానులకు ఊరటనిచ్చే అంశం. బహుశా ఫస్ట్ లుక్ విడుదల చేసినపుడే ప్రిన్స్ ఫ్యాన్స్ కు కొత్త పండగ ప్రారంభమవుతుందేమో!
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…