రాజమౌళి ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు?

Dosti Music RRR movie - Hema Chandra, MM Keeravaani -Jr NTR-Ram Charan-Rajamouliఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13 విడుదలకు ప్రకటించడంతో ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నారు. ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ అనే పేరిట ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అదరగొట్టారు.

ADVERTISEMENT

అయితే సహజంగా రాజమౌళి సినిమాల పాటలలో ఉండే హై మిస్ అయ్యింది అనే ఫీలింగ్ లేకపోలేదు. అయితే ఆ ఓపెనింగ్ మ్యూజిక్… అలాగే దర దర దమ్ దమ్ అంటూ వచ్చే హమ్మింగ్ అదిరింది. పాట మీద ఇంకో ప్రధానమైన కంప్లయింట్ హేమచంద్ర.

ఆ సింగర్ కు అంత స్క్రీన్ స్పేస్ ఇవ్వడం ఫ్యాన్స్ కు రుచించలేదు. హేమచంద్ర కు అంత స్క్రీన్ స్పేస్ ఇవ్వడం వెనుక లాజిక్ ఏంటో తెలీదు. అంత స్టార్ సింగర్ అయితే కాదు. హేమచంద్ర కాకుండా అనిరుధ్ తోనే అన్ని భాషలలో పాటను పాడించి అతనినే హైలైట్ చేస్తే సరిపోయేది.

అనిరుధ్ కు అంత స్క్రీన్ స్పేస్ ఇచ్చే స్టార్ వేల్యూ ఉంటుంది. అదే సమయంలో అతని వాయిస్ పాటకు ఉపయోగపడుతుంది. ఆ కారణంగానే తమిళ్ వెర్షన్ పాటకు బెటర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే చివరిలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ గెస్ట్ అప్పీరెన్స్ లతో ఏమైనా లోటు పాట్లు ఉంటే కవర్ చేశారు.

ఉన్న లోటుపాట్లను ఫ్యాన్స్ మర్చిపోయేలా చేసేశారు. అయితే రాజమౌళి తన స్థాయికి తగ్గట్టు ఇంకొంచెం హోమ్ వర్క్ చేసి ఉంటే బెటర్ అవుట్ ఫుట్ వచ్చేది.

ADVERTISEMENT
Latest Stories