Telugu

“దృశ్యం 3” సినిమా రివ్యూ: థ్రిల్లర్ సినిమాని ఇంతలా సాగదీయకూడదు జీతూ!

చిత్రం: దృశ్యం 3

M9 రేటింగ్: 2.25/5

ADVERTISEMENT

విడుదల తేదీ: మే 21, 2026

తారాగణం: మోహన్ లాల్, మీనా, అనిష్బ హాసన్, ఎస్తర్ అనిల్, సిద్ధిఖీ, వీణ నందకుమార్, కళాభవన్ షాజోన్ తదితరులు

నిర్మాణ సంస్థ: ఆశీర్వాద్ సినిమాస్

దర్శకత్వం: జీతూ జోసెఫ్

సంగీతం: అనిల్ జాన్సన్

నిర్మాత: ఆంటోని పెరంబవూర్

ఛాయాగ్రహణం: సతీష్ కురుప్

కూర్పు: వి.ఎస్.వినాయక్

దృశ్యం సిరీస్ ని ఇండియా వైడ్ ఉన్న క్రేజ్ & పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మలయాళంలో రూపొందిన ఈ ఫ్రాంచైజ్ కి పాన్ ఇండియా లెవల్లో మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అందుకే తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్, కన్నడలో రవిచంద్రన్, హిందీలో అజయ్ దేవగన్ లు రీమేక్ చేసారు. పార్ట్ 2 కూడా అదే స్థాయిలో అలరించేసరికి పార్ట్ 3 మీద అంచనాలు పెరిగాయి. అయితే.. మూడో భాగం రీమేక్ కి వెంకటేష్ దూరంగా ఉండడం, తమిళంలో ఇప్పుడు రీమేక్ చేసేందుకు కమల్ కూడా సిద్ధంగా లేకపోవడంతో మలయాళ మాతృకనే డబ్బింగ్ రూపంలో హిందీ తప్ప అన్నీ భాషల్లో విడుదల చేశారు. మరి జీతూ జోసెఫ్ మూడోసారి కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగాడా లేదా? అనేది చూద్దాం..!!

కథ:

జార్జ్ (మోహన్ లాల్) పోలీసుల్ని, న్యాయ వ్యవస్థని తప్పుడు దారి మళ్లించి, వరుణ్ హత్య కేస్ నుండి తన కుటుంబాన్ని కాపాడుకుంటూనే.. నిర్మాతగా మారి తన కథనే “దృశ్యం” అనే టైటిల్ తో ప్రొడ్యూస్ చేసి 100 విజయాన్ని అందుకుంటాడు.

అయితే.. ఓ జర్నలిస్ట్ (వీణ నందకుమార్) మాత్రం జార్జ్ కేసును సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూ.. ఆధారాలు సేకరిస్తూ ఉంటుంది. జార్జ్ తన కూతురికి పెళ్లి చేద్దాం అనుకునే సమయానికి పోలీస్ వ్యవస్థ మళ్లీ జార్జ్ & కుటుంబాన్ని అరెస్ట్ చేసేందుకు సన్నద్ధమవుతుంది.

ఈసారి జార్జ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఈసారి పోలీసులకి దొరికిన ఆధారం ఏమిటి? ఇప్పటికైనా కేస్ క్లోజ్ అయ్యిందా లేదా? అనేది “దృశ్యం 3” కథాంశం.

నటీనటుల పనితీరు:

మోహన్ లాల్ తన టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ పెర్ఫార్మెన్స్ తో జార్జ్ పాత్రలో ఎప్పట్లానే ఒదిగిపోయాడు. అతడి క్యారెక్టర్ కి ఆర్క్ కి యాడ్ చేసిన మైండ్ అబ్జెంట్ అనే సైకలాజికల్ ఇష్యూని పూర్తిగా ఎక్స్ ప్లోర్ చేయకుండా వదిలేశారు.

అన్నిటికంటే ముఖ్యంగా ఈ మూడో భాగంలో జార్జ్ పాత్ర అంత తెలివైనదిగా కనిపించదు. అందువల్ల ఎగ్జైట్ చేయలేదు.

మీనా, అనిష్బ, ఎస్తర్ లు ఫ్యామిలీ మెంబర్స్ గా పర్వాలేదనిపించుకున్నారు. సిద్ధిఖీ పాత్రకి సరైన మోటివేషన్ లోపించింది. అందువల్ల అతడి పాత్ర చేసే ప్లానింగ్ అంతా చాలా పేలవంగా ఉంటుంది. ఇదంతా అతడే చేస్తున్నాడు అనే రివిలీషన్ తప్ప.. అతడి పాత్ర ద్వారా సినిమాకి యాడ్ అయ్యింది ఏమీ లేదు.

సహదేవన్ పాత్రలో కళాభవన్ షాజోన్ పెర్ఫార్మెన్స్ బాగున్నా.. దానికి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ లేవు. అతని పగకి కారణం ఏంటి అనేది వివరించినా, దానికి అతడి కూతురు చేసిన సహాయం ఏమిటి? అనేది క్లారిటీ లేకుండా అయిపోయింది.

సాంకేతికవర్గం పనితీరు:

అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతం ప్రేక్షకులకి సినిమాటిక్ హై ఇవ్వలేకపోయింది. థ్రిల్లింగ్ & సస్పెన్స్ ఎలిమెంట్స్ ను కూడా సరిగా ఎలివేట్ చేయలేదు. పాటలు లేకపోవడం ప్లస్ అయ్యింది.

సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉన్నా.. సీజీ & గ్రీన్ స్క్రీన్ విషయంలో కనీస స్థాయి జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల లో క్వాలిటీ కంటెంట్ లా కనిపిస్తుంది. కలరింగ్ కూడా మరీ బ్రైట్ గా ఉంది. థ్రిల్లర్ సినిమాలకి పెట్టింది పేరైన మలయాళ చిత్రసీమలో ఈమాత్రం కేర్ తీసుకోకపోవడం గమనార్హం.

జీతూ జోసెఫ్ ఒకే కేస్ ను పట్టుకుని సాగదీస్తున్న విధానం “CID” సీరియల్ ను గుర్తుకు తెస్తుంది. క్వాలిటీ కూడా అలాగే ఉందనుకోండి. అయితే.. మూడో భాగాన్ని మాత్రం మరీ ఎక్కువగా సాగదీశారు. ఆఖరి 30 నిమిషాల్లో వేగం పెంచినా అప్పటికే ఆసక్తి కోల్పోయిన ప్రేక్షకులకు ఆ ఎండింగ్ అంత ఎగ్జయిటింగ్ గా అనిపించదు. సో, రైటర్ గా, దర్శకుడిగా జీతూ జోసెఫ్ ప్రేక్షకుల్ని “దృశ్యం 3”తో అలరించలేకపోయాడనే చెప్పాలి.

విశ్లేషణ:

“దృశ్యం” మొదటి రెండు భాగాల్లో కథానాయకుడు ఆడే ఆటలో అందరూ పాత్రధారుల్లా కనిపిస్తారు. ఆ ఆటను, ఆటలో వచ్చే మలుపులను ప్రేక్షకులు ఆస్వాదిస్తూ.. ఆఖరిలో హీరో ఇలా చేశాడా అని షాక్ అయ్యి, ఒక సంతృప్తితో థియేటర్ నుండి బయటికి వెళ్తారు ప్రేక్షకులు. ఈ మూడో భాగంలో ఆ ఆట తాలుకు మజా మిస్ అయ్యింది. అందులోనూ ఇక్కడ ఆట ఆడించేది కథానాయకుడు కాకపోవడం, వేరే వాళ్ల ఆటలో అతడు పాత్రధారిలా కనిపించడం, చివర్లో వచ్చే ట్విస్ట్ కూడా మ్యానేజ్ చేసినట్లుగా ఉంటుంది తప్పితే, హీరో తెలివిగా ఆడిన ఆటలా కనిపించదు. అందువల్ల “దృశ్యం” ఫ్రాంచైజ్ లో ఉండే కిక్ ఇందులో మిస్ అయ్యింది. ఇది సరిపోదన్నట్లుగా నాలుగో భాగానికి క్లిఫ్ హ్యాంగర్ ను ఇచ్చాడు జీతూ. ఒకే కేస్ ను ఇంకెన్నాళ్లు, ఇంకెన్ని కోణాల్లో, ఎన్ని విధాలుగా సాగదీసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాడో చూడాలి.

ఓవరాల్ గా.. థ్రిల్లర్ సినిమాని ఇంతలా సాగదీయకూడదు జీతూ!

M9 రేటింగ్: 2.25/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Recent Posts

Rohit’s 2027 WC Spot: Cricket Legend Warns BCCI

Rohit Sharma and Virat Kohli have retained their places in India’s ODI squad for the…

29 minutes ago

Money And Lands: KTR’s Old Videos Viral Now!

Telangana politics have started to revolve around the discussion on lands and illegal monetary gains…

60 minutes ago