Telugu

రాయలసీమ రూపురేఖలు మార్చేయబోతున్న దుగ్గరాజుపట్నం

వరుసగా రెండుసార్లు శాపగ్రస్తమై అన్ని విధాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి సిఎం చంద్రబాబు నాయుడుని ఆ దేవుడే పంపించినట్లనిపిస్తుంది… రాష్ట్రానికి వస్తున్న భారీ ప్రాజెక్టులు, పరిశ్రమలు, జరుగుతున్న అభివృద్ధి చేస్తూంటే!

చెన్నైకి ఉత్తరంగా పులికాట్ సరస్సుకి, శ్రీహరికోటకి సమీపంలో తిరుపతి జిల్లాలోని వాకాడు మండలంలో గల ఓ మారుమూల గ్రామం దుగ్గరాజుపట్నంకి మహర్దశ మొదలైంది.

ADVERTISEMENT

అక్కడ ఓ భారీ నౌకాశ్రయంతో పాటు రూ.30,000 కోట్లు పెట్టుబడితో సుమారు 3,500 ఎకరాలలో ఓ నౌకల తయారీ కేంద్రం (షిప్ బిల్డింగ్ యూనిట్) కూడా ఏర్పాటు కాబోతోంది.

కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఏర్పాటవుతున్న నౌకాశ్రయంలో 10,000 మందికి, నౌకల తయారీ కేంద్రంలో ప్రత్యక్షంగా 30,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

దుగ్గరాజుపట్నం వద్ద ఏర్పాటవుతున్న నౌకల తయారీ కేంద్రంలో భారీ నౌకల తయారీ, దేశ విదేశాల నుంచి ఇక్కడకు వచ్చే వాటికి మరమత్తులు కూడా చేసేందుకు వీలుగా దీనిని నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద నౌకల తయారీ కేంద్రంగా నిలువబోతోంది.

దీనికి అనుబంధంగా రవాణా (లాజిస్టిక్స్), మౌలిక వసతుల కల్పన, స్టీల్ ప్లాంట్‌, మెరైన్, హోటల్స్‌ తదితర రంగాలలో మరో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఈ రెండూ ఒకే చోట ఏర్పాటవుతున్నందున చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. దాంతో ఆ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ది చెందుతాయి. మరో రెండు మూడేళ్ళలో ఆ ప్రాంతం రూపురేఖలే సమూలంగా మారిపోతాయి.

గత ప్రభుత్వం రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ఏం చేసింది? అంటే కనీసం రోడ్లు, కాలువలు వంటి మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయింది.

కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తికాక ముందే రాయలసీమలో ప్రతీ జిల్లాకు అనేక పరిశ్రమలు తీసుకువస్తోంది. ఇందుకు ఈ దుగ్గరాజుపట్నం పోర్టు, నౌకల తయారీ కేంద్రమే నిదర్శనం.. కాదా?

 

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Aadarsha Kutumbam Gets a Glamour Twist

Venkatesh and Trivikram Srinivas are bringing two unexpected glamour surprises into Aadarsha Kutumbam. Nivetha Pethuraj…

24 minutes ago

అమరావతి కోసం భూమినిచ్చి జైలుకెళ్ళిన ధనేకుల.. చిరస్మరణీయుడు

ఎప్పుడో వంద రెండు వందల సంవత్సరాల క్రితం రాజులు దేవాలయాలకు భూములు, కానుకలు ఇస్తే, రోడ్ల పక్కన మొక్కలు నాటిస్తేనే…

50 minutes ago