
ఇక ఈ నెల 23న విడుదల కాబోతున్న “దువ్వాడ జగన్నాధమ్” సినిమాలో కూడా బన్నీ డ్యాన్స్ లు ఓ రేంజ్ లో అదరగొట్టాడని దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల వెల్లడించారు. బహుశా ఈ పోస్టర్ చూస్తే, బన్నీ స్టెప్పుల గురించి ఇంకే ప్రశ్నలు తలెత్తవని చెప్పవచ్చు. ఒక కాలు మీద నిల్చుని, ఒక చేతిలో జేబులో పెట్టుకుని వేసినట్లుగా కనపడుతున్న ఈ స్టెప్ సినిమాకే హైలైట్ అయ్యేలా కనపడుతోంది.
చూడడానికి సింపుల్ గా, స్టైలిష్ గా కనపడుతోంది గానీ, ఇదేమీ అంత తేలిక కాదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! మరి పోస్టర్ లోనే ఇలా దుమ్మురేపుతుంటే… ఇక ధియేటర్ల దగ్గరికి వచ్చేపాటికి అభిమానులు సీట్లల్లో కూర్చునే స్థితిలో ఉంటారో లేదో! ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు బంపర్ హిట్ కాగా, మరో రెండు రోజుల్లో ఫుల్ ఆల్బమ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఆ సందర్భంలో విడుదల చేసిందే ఈ స్టిల్..!
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…