
వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకెళ్లిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సుమారు ఏడు నెలల తరువాత తిరిగి జగన్ తో కనిపించారు. నేడు అసెంబ్లీ కెళ్ళొస్తున్న సమయంలో అదే అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ ను కలిశారు దువ్వాడ.
దీనితో వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని నిముషాల సంభాషణల పై అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి. దువ్వాడను జగన్ తిరిగి పార్టీలోకి ఆహ్వానించారని, అందుకు దువ్వాడ కూడా ఒకే చెప్పారంటూ కథనాలు మొదలయ్యాయి.
అయితే ఇందుకు దువ్వాడ, జగన్ ముందు కొన్ని షరతులు పెట్టారని, ధర్మాన విషయంలో పార్టీ తనకు సానుకూలంగా ఉండాలని, అందుకు జగన్ సహకరిస్తే వైసీపీ తరుపున గళం వినిపించేందుకు దువ్వాడ సిద్ధమంటూ ప్రచారం జరుగుతుంది.
అయితే దువ్వాడ ఎంట్రీ తో వైసీపీ నుంచి ఎగ్జిట్ ఎవరు అనే ప్రశ్న కూడా చర్చనీయాంశంగా ఉంది. ఒకపక్క ధర్మాన బ్రదర్స్ అంశం మరోపక్క దువ్వాడ మాజీ భార్య వాణి విషయంలో జగన్ ఎం చెయ్యబోతున్నారు.?
జగన్ ఆదేశాలకు అనుగుణంగా దువ్వాడకు మద్దతుగా ఈ ఇద్దరు వైసీపీ కోసం పనిచేసేందుకు సిద్ధమా.? ఇలా దువ్వాడ ఎంట్రీ అనే ఒక్క విషయం పై వైసీపీ పై ఇన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఈ రోజు అసెంబ్లీ నుంచి తిరిగొచ్చే క్రమ్మలో జగన్ తో పాటు వైసీపీ 10 మంది ఎమ్మెల్యే లకు తోడు అక్రమ సంబంధాలతో రచ్చకెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఒక వైపు ఒకరిని చంపి డోర్ డెలివరీ చేసిన మరో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరోవైపు ఉండడం గమనార్హం.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…