
1995లో వచ్చిన ‘కరణ్ అర్జున్’ అనే హిందీ సినిమాకి ఇది రీమేక్ అనేది ఆ వార్తలోని సారాంశం. రాకేశ్ రోషన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్… షారుక్ ఖాన్ ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అదే సినిమాను రాజమౌళి రీమేక్ చేయనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో… నిర్మాత డీవీవీ దానయ్య స్పందించక తప్పలేదు.
“ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని, ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను వెల్లడిస్తామని” తెలిపారు. ఇటీవల ‘భరత్ అనే నేను’ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టిన దానయ్య, ఈ మల్టీస్టారర్ ను దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని జరుగుతోన్న ప్రచారం తెలిసిందే. అయితే పుకార్లను నమ్మవద్దు… అన్నీ అధికారికంగా చెప్తాం… అంటున్నారు దానయ్య.
Generally, the Supreme Court of India prefers to impose a complete ban on cracking of…
KTR's praise for Chandrababu Naidu over water management in Andhra Pradesh raises a question for…