
Political parties intensify protests against the E20 petrol policy, raising pressure on the BJP over ethanol-blended fuel implementation.
కాలం కలిసిరాకపోతే తాడు కూడా పామై ప్రాణాలు తీస్తుంది అనే సామెత ఇప్పుడు కేంద్ర బీజేపీ కి బాగా సరిపోతుందేమో అనిపిస్తుంది. దేశంలో వరుసగా మూడుమార్లు నిర్వీరామంగా అధికారాన్ని చేపట్టిన బీజేపీ, తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షం అనే గళమే వినిపించకుండా చేసిన బీజేపీ, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ ని రాజకీయంగా పాతాళానికి తొక్కిన బీజేపీ ఇప్పుడు చిన్న గాలివాన కు ఒరిగిందా అన్నట్టుగా తయారయ్యింది.
‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే సోషల్ మీడియా లో పుట్టుకొచ్చిన పార్టీ తన నిరసనలతో, ఉద్యమంతో కేంద్ర బీజేపీ మెడలు వంచింది, దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు ఒక బాట వేసింది. సీజేపీ నిర్వహించిన నీట్ ఉద్యమం దేశ రాజకీయాలలోనే కాదు బీజేపీ రాజకీయ చరిత్రలో కూడా ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
గత పుష్కర కాలంగా దేశ రాజకీయాలను ఏకచక్రాధిపత్యంగా ఏలిన బీజేపీ మొదటిసారిగా ప్రత్యర్థి ఒత్తిడికి తలవంచింది. దానితో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా తో బీజేపీ తన తొలి వికెట్ కోల్పోయింది. అయితే నీట్ ఉద్యమం సీజేపీ గెలుపు కన్నా బీజేపీ ఓటమిని ఎక్కువ ప్రభావితం చేసిందని చెప్పాలి.
దాని ఫలితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పై పోరాడేందుకు, బీజేపీ పెద్దల పై రాజకీయ ఒత్తిడులు తెచ్చేందుకు అనేక అంశాలతో అనేక రాజకీయ పార్టీలు ఉద్యమాలకు నడుం బిగిస్తున్నారు. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ మాదిరి E20 పెట్రోల్ సమస్యకు వ్యతిరేకంగా ‘E20 జనతా పార్టీ’ పుట్టుకొచ్చింది.
దానికి తోడు ఇటు విపక్ష కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బీజేపీ కి వ్యతిరేకంగా గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఢిల్లీ రాజకీయాలలో సంచనలం సృష్టించిన ఆప్ ఇప్పుడు E20 పెట్రోల్ కి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు బరిలోకి దిగనుంది.
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) విధానానికి వ్యతిరేకంగా ఆగష్టు 3 న ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వరకు మార్చ్ నిర్వహిస్తామంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. భారత్ – అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం కారణంగా బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల పై E20 పెట్రోల్ ని బలవంతగా రుద్దే ప్రయత్నం చేస్తుందని,
దీని కారణంగా వాహనాలు తమ సామర్ధ్యాన్ని కోల్పోతున్నాయని, ప్రజలు నార్మల్ పెట్రోల్ వాడాలా.? లేదా ఇథనాల్ కలిపిన E20 ఇంధనాన్ని వినియోగించేలా అన్నది వారి ఎంపికకే వదిలేయాలని, అలాకాకుండా బీజేపీ తానూ పట్టిన కుందేలుకు ముందే కాళ్ళు అంటూ ఒంటెద్దు పోకడలతో ముందుకెళితే బీజేపీ మంత్రివర్గం నుంచి మరో వికెట్ పడడం ఖాయం అంటూ మండియపడుతున్నారు బీజేపీ ప్రత్యర్థులు.
India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…
With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…