Telugu

ఆమె కోసం ఒక్క ఎంపీనైనా లోపలేయక తప్పదేమో?

ఇటు వైఎస్ వివేకా హత్య కేసు విచారణ, అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ రెండూ ఒకేసారి వేగవంతం అవడం కాస్త ఆశ్చర్యకరమే. ఈ రెండు కేసులలో రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, వారికి అత్యంత సన్నిహితులు ఉండటం, అక్కడ ఢిల్లీలో మోడీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన ఆమాద్మీ ప్రభుత్వంలోని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా పలువురు ఉండటంతో, వీటితో రాజకీయాలు కూడా బలంగా ముడిపడి ఉన్నాయి.

రాజకీయ కోణంలో నుంచి చూస్తే, కేంద్ర ప్రభుత్వం ఈ కేసులతో అక్కడ ఢిల్లీ ఆమాద్మీ ప్రభుత్వాన్ని, ఇక్కడ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని లొంగదీసుకొనే ప్రయత్నం చేస్తోందని ఆ పార్టీలు ఆరోపిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు.

ADVERTISEMENT

అయితే సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలకు వీరవిధేయంగా వ్యవహరిస్తున్నందున, ఈ రెండు కేసులలో కేంద్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేందుకు ప్రయత్నించడం లేదు. ఎంపీ మాగుంట కుమారుడు రాఘవ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసినప్పటికీ వైసీపీలో ఎవరూ కిమ్మనకపోవడమే ఇందుకు నిదర్శనం. వివేకా హత్య కేసులో చిక్కుకొన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కేంద్రాన్ని వేలెత్తి చూపే సాహసం చేయలేక, టిడిపిని నిందిస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.

ఈ కేసులతో రాజకీయాలు ముడిపడి ఉన్నందున తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయడానికి ఈడీ తొందరపడటం లేదు కానీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయక తప్పదని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. ఇప్పుడు మరో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈనెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసు పంపడం గమనిస్తే, ఈడీ, సీబీఐలు వాటి వెనుక ఉన్న కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నట్లు అర్దమవుతోంది.

కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేస్తే కేసీఆర్‌ని తట్టుకోవడం చాలా కష్టం. తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండమే అవుతుంది. కనుక ముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని తర్వాత అవినాష్ రెడ్డిని, ఆ తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా ముందుకు సాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పుకోగలుగుతుంది. అప్పుడు కల్వకుంట్ల కవితని కూడా అరెస్ట్ చేయవచ్చునని భావిస్తోందేమో? కనుక కల్వకుంట్ల కవిత అరెస్ట్ చేయాలంటే ఇద్దరు వైసీపీ ఎంపీలలో కనీసం ఒకరినైనా లోపల వేయక తప్పదేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijay Needs Venky Atluri, But Why?

Vijay Devarakonda had a new release in the form of Ranabaali yesterday. The film opened…

1 minute ago

రేవంత్‌ని విమర్శించాలంటే చంద్రబాబుని పొగడాల్సిందే… తప్పదు!

అవును. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్న నోటితోనే ఇప్పుడు హరీష్‌ రావు పొగడక తప్పడం లేదు. అయితే చంద్రబాబు…

10 minutes ago