Telugu

ప‌వ‌న్‌, బ‌న్నీల‌ను ఈగో దూరం చేసిందా..!

టాలీవుడ్ లో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎవరి జోనర్లో వారు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. వీరిద్దరూ ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా.. తమ సొంత ఇమేజ్ తో పైకి వచ్చారు. అల్లు అర్జున్ ఇండస్ట్రీకి రాకముందే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా మంచి స్థాయిలో ఉన్నాడు. ఇద్దరు కూడా మొదట్లో చిరంజీవి నీడ నుంచి వచ్చిన వారిమే అని చెప్పుకున్నారు.

కానీ తదనంతరం ఎవరికివారు కష్టపడి సొంతంగా అభిమానులను ఏర్పరుచుకున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఎప్పటినుంచో ఈగో క్లాషెస్ ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. చాలాసార్లు పవన్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అన్నట్టు సోషల్ మీడియాలో వార్ కూడా నడిచింది. ఒక ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి అడిగితే చెప్పను బ్రదర్ అంటూ అప్పట్లో బన్నీ షాకిచ్చాడు. ఇదే విషయాన్ని పవన్ ఫ్యాన్స్ పదేపదే గుర్తు చేస్తూ బన్నీకి మెగా సపోర్ట్ లేకుండా ఎక్కడినుండి వచ్చాడు అంటూ నిత్యం ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

అప్పట్లో బన్నీ సినిమాల ఆడియో ఫంక్షన్ లకు చాలాసార్లు పవన్ కళ్యాణ్ వచ్చాడు. కానీ ఇప్పుడు బన్నీ చేసిన పని మెగా అభిమానులతో పాటు పవన్ అభిమానులకు మండేలా చేస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్ నాయక్ విషయంలో మెగా హీరోలు అందరూ విషెస్ తెలిపారు. మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటూనే పవన్ కళ్యాణ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

కానీ బన్నీ మాత్రం స్పందించకుండా మౌనంగా ఉండడంతో పవన్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. పెద్ద స్టార్ అయిపోయాడు కాబట్టి తాను వచ్చిన మూలాలను మర్చిపోతున్నాడని మెగా అభిమానులు విమర్శిస్తున్నారు. కాగా మెగా అభిమానుల ప్రశ్నలకు బన్నీ ఫ్యాన్స్ కూడా గట్టిగానే సమాధానాలు ఇస్తున్నారు.

బన్నీ సొంతంగా ఎదిగాడని, తన కష్టంతోనే ఐకాన్ స్టార్ అయ్యాడని చెప్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో బన్నీ కి ఉన్నంత ఫాలోయింగ్ మెగా హీరోలకు లేదంటూ కౌంటర్లు వేస్తున్నారు. అయితే సామాన్య సినీ జనం మాత్రం ఇద్దరు హీరోల మధ్య ఈగో క్లాషెస్ ఉన్నాయని అందుకే ఒకరి సినిమాను ఇంకొకరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు. ఇక ఈ మధ్య నందమూరి బాలకృష్ణతో బన్నీ సన్నిహితంగా ఉండటం కూడా మెగా అభిమానులకు నచ్చట్లేదు. బన్నీనీ మెగా హీరోలు దూరం పెడుతున్నారనే కార‌ణంతోనే నందమూరి బాలకృష్ణకు దగ్గర అవుతున్నాడని అంటున్నారు మెగా ఫ్యాన్స్. మొత్తానికి బన్నీ పోస్ట్ చేయకపోవడం ఇప్పుడు అభిమానుల మధ్య వార్ కు దారి తీసింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Nana’s Death Deserves Dignity but Can It Erase Allegations?

Nana Patekar passed away in Goa on October 8 at the age of 75 due…

14 minutes ago

Sree Vishnu on Comrade Kalyan’s Audience Response

Sree Vishnu has established himself as an entertainer in Telugu Cinema. His latest movie, Comrade…

34 minutes ago