Telugu

ఏపీ కొత్త డీజీపీగా గుప్తా.

ఎన్నికల వేళ ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంది అనే విధంగా నిన్నటి వరకు వైసీపీ కి వీరవిధేయుడిగా ఉంటున్నారు అంటూ ప్రతిపక్షాల నుండి ఆరోపణలు ఎదుర్కుంటున్న కేవీ రాజేంద్రనాధ్ రెడ్డిని ఎన్నికల విధుల నుండి తప్పించి ఆయన పై బదిలీ వేటు వేసి వైసీపీకి వుహించని షాక్ ఇచ్చింది ఈసీ.

దీనితో రాష్ట్రానికి రానున్న కొత్త డీజీపీ ఎవరన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ మొదలయింది. ఈ ఉత్కంఠకు తేరా దింపుతూ కేవీ రాజేంద్రనాధ్ రెడ్డి పై బదిలీ వేటు పడడంతో ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లు సిఫారస్ చేయాలంటూ ఈసీ ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఏపీ ప్రభుత్వం సీనియారిటీ ప్రాతిపదికగా ద్వారకా తిరుమల రావు, హరీష్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేర్లను సిఫారస్ చేసింది.

ADVERTISEMENT

అయితే ఈ ముగ్గురులో ఈసీ హరీష్ గుప్తాను ఏపీ డీజీపీగా ఎంపిక చేసి రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది. హరీష్ గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారిగా పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈయన హోమ్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

తక్షణమే హరీష్ గుప్తాను విధులలో చేరాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే అనంతపూర్ డీఐజీ అమ్మిరెడ్డి పై కూడా ఈసీ బదిలీ వేటు వేసింది. స్థానిక వైసీపీ నేతలకు అందుబాటులో ఉంటూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ కూటమి నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈసీ ఆ మేరకు అమ్మి రెడ్డిని రిలీవ్ చేసి కింద స్థాయి ఉద్యోగికి బాధ్యతలు అప్పగించాలంటూ సీఎస్ కు ఈసీ ఉత్తర్వులు పాస్ చేసింది.

అలాగే అనంతపూర్ అర్బన్ డిఎస్పీ గా టీవీవీ ప్రతాప్ కుమార్, రాయచోటి డిఎస్పీ గా రామచంద్రరావు ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఇలా అధికారుల మార్పులతో ఈసీ, ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు బిజీబిజీగా గడుపుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Yash’s Ravana Worse Than Adipurush? Huge Outrage

Yash’s look as Ravana in Nitesh Tiwari’s Ramayana has sparked another debate, with Aarya Babbar…

20 minutes ago

ఆ మూడు కేసులు … వైసీపీ రెక్కలు విరవనున్నాయా.?

ఏపీ రాజకీయాలలో ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్ళుగా గ్రహణం పట్టిన చంద్రుడిలా చీకటిలో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు,…

47 minutes ago