ఏపీలో భద్రత… జరభధ్రం..!

చేతిలో అధికారాన్ని పెట్టుకుని గడిచిన అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో ‘జగన్ అండ్ కో’ సృష్టించిన విధ్వంసకాండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ ను పిచ్చోడిగా చూపించి నడిరోడ్డుపై కూర్చోబెట్టిన చరిత్రను సొంతం చేసుకున్న వైసీపీ సర్కార్ విధ్వంసం పోలింగ్ వరకు కూడా నిర్విరామంగా కొనసాగింది.

పోలింగ్ తో ఈ విధ్వంసం ఆగిపోదు, ఫలితాల తర్వాత కూడా ఏపీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ సమాచారంతో ఇప్పటికే అదనపు బలగాలను సమస్యాత్మక ప్రాంతాలలో మోహరించిన విషయం తెలిసిందే. పచ్చదనానికి, ఎటకారానికి మారు పేరుగా నిలిచే ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఇందుకు వేదిక కావడంపై ఏపీలో భద్రతపై ప్రజల్లో విరివిగా చర్చలు జరుగుతున్నాయి.

ADVERTISEMENT

గడిచిన నాలుగైదు రోజులుగా రిలీజ్ అవుతోన్న ‘వైసీపీ అండ్ కో – విధ్వంసకాండ’ వీడియోలతో ప్రజల్లో కూడా స్పష్టత వచ్చేసింది. వీటన్నింటికి తోడు కేంద్ర హోంశాఖ తాజాగా ఏపీ డీజీపీకి పంపిన లేఖతో, సామాన్య ప్రజలకే కాదు, ప్రధాని పర్యటిస్తున్న సమయంలో కూడా భద్రత కొరవడిందని స్పష్టమయింది.

మే 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో పర్యటించిన విషయం తెలిసిందే. విశేష సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ రోడ్ షోలో మోడీ – చంద్రబాబు – పవన్ కళ్యాణ్ లు ఒకేవేదికపై తారసపడ్డారు. అయితే ఈ రోడ్ షోలో భద్రత లోపించిందని కేంద్ర హోమ్ శాఖ సీరియస్ అయ్యింది.

ప్రధాని పర్యటిస్తున్న ప్రాంతం ‘నో ఫ్లైయింగ్ జోన్’గా డిక్లేర్ కాగా, నాడు రోడ్ షో ప్రారంభానికి ముందు, ముగింపు సమయంలో కూడా విజయవాడ, బందర్ రోడ్డులో డ్రోన్లు ఎగరడం భద్రతా లోపాలను ఎత్తిచూపినట్లయ్యింది. ఒక డ్రోన్ ను ఎస్పీజీ సిబ్బంది నిర్వీర్యం చేసిన వార్తలు కూడా నాడు ప్రధానంగా మీడియా వర్గాలలో చర్చలు జరిగాయి.

దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీకి కేంద్ర హోమ్ శాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఏకంగా ప్రధాని పర్యటన చేస్తున్న సమయంలో కూడా భద్రతను సరిగా అందజేయడంలో కూడా ఏపీ పోలీసులు విఫలం కావడం అంటే, అసలు ఏపీలో సామాన్యులకు భద్రత ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నం కాక మానదు.

ప్రస్తుతం జూన్ 4వ తేదీ వైపుకే అందరి చూపులు! ఈ అరాచక ప్రభుత్వం పోవాలని ప్రతిపక్షాలు, మరోసారి అధికారాన్ని తమ కబంధ హస్తాలలో ఉంచుకోవాలని అధికార పక్షం ఉవ్విళ్లూరుతోంది. స్తబ్దుగా మారిన రాజకీయంలో వైసీపీ పోలింగ్ విధ్వంస వీడియోలు హల్చల్ చేస్తుండగా, తాజాగా కేంద్రం సీరియస్ కావడం ‘జగన్ అండ్ కో’కు మింగుడు పడని అంశమే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Daily Hearing At CBI Court, But Can Jagan Stay Out?

It has been more than dedicate since the CBI and the enforcement directorate have failed,…

4 minutes ago

వివేకా హత్య కేసులో సీబీఐ కంటే ఈడీ స్పీడ్‌!

“వివేకా హత్య కేసుతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఆ ఆరోపణలతో నేను చాలా ఆవేదన అనుభవిస్తున్నాను. నేను ఏ…

9 minutes ago