Telugu

ఎలాన్ మస్క్! ఎందుకీ రిస్క్?

డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ… అంటూ ఎలాన్ మస్క్ ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్టు యుద్ధ ప్రకటన వంటిదే. తన ‘స్టార్ లింక్’ శాటిలైట్స్ వ్యవస్థ ద్వారా ఆయన భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించాలనుకున్నారు.

ADVERTISEMENT

అయితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన ‘రిలయన్స్ జియో’కు పోటీగా మారుతుందని అయన ప్రభుత్వ పెద్దలతో తనకున్న పరిచయాలు ఉపయోగించుకొని, తన ‘స్టార్ లింక్’ సేవలకు అనుమతి రాకుండా చేస్తున్నారని ఎలాన్ మస్క్ నిసంకోచంగా సోషల్ మీడియాలో ఆరోపించారు.

“డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. భారతదేశానికి మీరే నిజమైన బాస్ అని గుర్తించలేకపోయినందుకు క్షమించండి” అంటూ ఎలాన్ మస్క్ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. తద్వారా భారత్‌ను శాశిస్తున్నది మోడీ ప్రభుత్వం కాదని ముఖేష్ అంబానీయే అని ఎద్దేవా చేసినట్లయింది.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర సమాచార శాఖా మంత్రి జ్యోతిరాదిత్య వెంటనే స్పందించారు. ఈవిధంగా మీరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం సులభమే. కానీ వాస్తవాలను కూడా గుర్తించాలి కదా? ట్రాయ్ నిబంధనల ప్రకారం, మూడు సంస్థలకు అనుమతులు లభించాయి. అవి సేవలు అందిస్తున్నాయి. స్టార్‌లింక్‌కు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి.

కానీ ప్రతి సంస్థ భారత్‌ భద్రత, ట్రాయ్ నిబంధనలు గౌరవించడం తప్పనిసరి. భారత్‌ నిబంధనలకు లోబడి ఉంటే ఎవరికైనా స్వాగతం చెపుతాం. ఎవరితోనైనా పోటీకి సిద్ధం. కానీ భారతదేశాన్ని, మా మార్కెట్లను ఎగతాళి చేస్తూ ఎవరూ మార్కెట్‌లోకి ప్రవేశించలేరని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.

భారత్‌లో అంబానీ, అదానీలకు పాలకులకు మద్య గల సన్నిహిత సంబందాలు, వారి వ్యాపార సామ్రాజ్యాలు దేశమంతటా శరవేగంగా విస్తరిస్తుండటం వంటివి కళ్ళెదుట కనిపిస్తున్నప్పుడు, ఎలాన్ మస్క్ ఆరోపణలను పూర్తిగా కొట్టిపడేయలేము.

అలాగని భారత్‌ ఇంటర్నెట్, టెలీకమ్యూనికేషన్స్ వ్యవస్థలను, దేశభద్రతను పణంగా పెట్టి ఎలాన్ మస్క్‌కు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించలేము.

అయినా జ్యోతిరాదిత్య సింధియా చెప్పినట్లు, భారత్‌ను ప్రేమతో గెలుచుకోవాలి కానీ ఎగతాళి చేసి కాదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

చిన్న శ్రీనుకు పెద్ద బాధ్యత.. అరకు పార్లమెంట్

విజయనగరం వైసీపీకి పెద్ద దిక్కు బొత్స సత్యనారాయణకు రైట్ హ్యాండ్ వంటి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి…

4 minutes ago

ఎపిక్ ఓటీటీ రెస్పాన్స్: సీక్వెల్ కష్టమే

ఎపిక్ థియేటర్లలో విడుదలైన రోజే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇండైరెక్ట్ గా సినిమాకి వస్తున్న రెస్పాన్స్ అండ్…

28 minutes ago